‘పీకే’ సినిమాను గుర్తుకు తెచ్చేలా Laal Singh Chaddha ట్రైలర్

ABN , First Publish Date - 2022-05-30T23:48:54+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్(Aamir Khan) నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha). కరీనా కపూర్ (Kareena Kapoor), నాగచైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలు పోషించారు.

‘పీకే’ సినిమాను గుర్తుకు తెచ్చేలా Laal Singh Chaddha ట్రైలర్

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్(Aamir Khan) నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha). కరీనా కపూర్ (Kareena Kapoor), నాగచైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఫైనల్‌లో రెండో స్ట్రాటజిక్ టైమ్డ్ ఔట్‌లో ఆమిర్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. వయాకాం 18 స్టూడియోస్‌తో కలసి తన సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఆగస్టు 11న విడుదల కానుంది. అమెరికన్ ఫిలిం ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump)కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఆమిర్ ఈ చిత్రంలో లాల్ సింగ్ చద్దాగా నటించాడు. బుబ్లా అనే పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నాడు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్‌లో ఆమిర్ ముఖ కవళికలు ‘పీకే’ సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. నాలుగేళ్ల అనంతరం ఆమిర్ తెరపై కనిపించనుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.      


నాగచైతన్యకు బాలీవుడ్‌లో ఇదే తొలిచిత్రం. ఈ నేపథ్యంలో అతడు ఆమిర్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘నేను గత 12ఏళ్లలో నేర్చుకున్నదానిని, ఆమిర్ ఖాన్ నుంచి కేవలం 45రోజుల్లోనే నేర్చుకున్నాను. సినిమా కోసం అతడు అంకితభావంతో పనిచేస్తాడు. తన చుట్టు పక్కల వారిని ప్రభావితం చేస్తాడు. ఆమిర్ మొదట నటుడైనప్పటికి అతడికి అనేక క్రాఫ్ట్స్‌లో నైపుణ్యం ఉంది. ఎప్పుడు కథ గురించే ఆలోచిస్తాడు. సినిమా స్టోరీ గురించే మాట్లాడుతాడు. బాక్సాఫీస్ నంబర్స్ గురించి అస్సలు పట్టించుకోడు’’ అని నాగచైతన్య తెలిపాడు. ‘లాల్ సింగ్ చద్దా’ కు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. గతంలో ఆమిర్ హీరోగా తెరకెక్కిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ను అద్వైతే డైరెక్షన్ చేశాడు.   


  




Updated Date - 2022-05-30T23:48:54+05:30 IST