మొదటి ప్రేమ కథను చెప్పిన Aamir Khan.. మనస్సు ముక్కలయిందన్న హీరో..
ABN , First Publish Date - 2022-06-30T02:06:15+05:30 IST
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan). మూడేళ్లకు ఓ సినిమా చేసిన రికార్డులు బద్దలు కొడుతుంటారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan). మూడేళ్లకు ఓ సినిమా చేసిన రికార్డులను బద్దలు కొడుతుంటారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha). అమెరికన్ ఫిలిం ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump)కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. కరీనా కపూర్ (Kareena Kapoor), నాగచైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నారు. వయాకాం 18 స్టూడియోస్‌తో కలసి తన సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ఓ మెలోడియస్ సాంగ్ ‘ఫిర్ నా ఐసి రాత్ ఆయేగీ’ (Phir Na Aisi Raat Ayegi)ని ఆమిర్ ఖాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. తన మొదటి ప్రేమ కథను చెప్పారు. అది ఫెయిల్ కావడంతో అప్పుడు తన మనస్సు ముక్కలయిందని పేర్కొన్నారు.
తన సన్నిహిత మిత్రురాలే, తన ప్రియురాలని ఆమిర్ ఖాన్ చెప్పారు. ‘‘గతంలో నేను టెన్నిస్ ఆడేవాడిని. నేను ఆడే క్లబ్‌కే ఆమె కూడా వచ్చేది. దూరం నుంచే చూసేవాడిని. నేను ప్రేమిస్తున్నట్టు ఆమెకు ఎప్పుడు చెప్పలేదు. ఒక రోజు నేను క్లబ్‌కు వెళ్లేసరికి ఆమె కుటుంబంతో సహా దేశం విడిచి వెళ్లిపోయింది. ఆ సమయంలో నా మనస్సు ముక్కలైంది. కానీ, ఒక మంచి పని మాత్రం జరిగింది. నేను టెన్నిస్ ప్లేయర్‌గా మారిపోయాను. కొన్నేళ్లకు స్టేట్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఛాంపియన్‌గా మారాను’’ అని ఆమిర్ ఖాన్ చెప్పారు. తాజాగా విడుదల చేసిన సాంగ్‌కు అన్ని వైపులా నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. లిరిక్స్ బాగున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్ట్ పెడుతున్నారు. నాలుగేళ్ల అనంతరం ‘లాల్ సింగ్ చద్దా’ తో ఆమిర్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే, ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో తెలియాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.