Laal Singh Chaddha: ఆసక్తికరంగా థీమ్ పోస్టర్

ABN , First Publish Date - 2022-08-01T20:29:28+05:30 IST

తెలుగులో మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) సమర్పిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్ బ్యానర్లపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్

Laal Singh Chaddha: ఆసక్తికరంగా థీమ్ పోస్టర్

తెలుగులో మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) సమర్పిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్ బ్యానర్లపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor), అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) తదితరులు నటించిన ఈ చిత్రాన్ని అద్వైత్ చందన్ (Advait Chandan) దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘మనం కథలోనా, కథే మనలోనా, అదేంటో చిత్రం’ అనే పదాలతో రూపొందిన ఈ థీమ్  పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ పోస్టర్‌లో ఆమిర్ ఖాన్ చిన్నప్పటి నుండి.. పెద్దవాడై సైనికుడిగా మారే వరకు ఉన్న దశలన్నింటిని చూపించారు. ఆమిర్ లైఫ్‌లో చైతూ, కరీనా కపూర్‌‌లు భాగమయ్యే దశలను కూడా ఈ పోస్టర్‌లో చూపించారు. కాగా, హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయినటువంటి ‘ఫారెస్ట్ గంప్’ సినిమా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య బోడి బాలరాజుగా  కీలక పాత్రలో ఆమిర్ ఖాన్‌తో కలిసి సైనికుడిగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు కూడా మంచి స్పందనను రాబట్టుకోగా.. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది.



Updated Date - 2022-08-01T20:29:28+05:30 IST