Laal Singh Chaddha: డిజాస్టర్‌ అయినా సరే.. ఆ 3 సూపర్ హిట్ సినిమాల కంటే ఆమీర్‌ఖాన్ సినిమాకే కలెక్షన్లు ఎక్కువట..!

ABN , First Publish Date - 2022-08-24T18:19:16+05:30 IST

ఈ ఏడాది బాలీవుడ్‌కి బ్యాడ్ ఫేజ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మూవీస్ విడుదల కాగా.. అందుకే కేవలం మూడంటే..

Laal Singh Chaddha: డిజాస్టర్‌ అయినా సరే.. ఆ 3 సూపర్ హిట్ సినిమాల కంటే ఆమీర్‌ఖాన్ సినిమాకే కలెక్షన్లు ఎక్కువట..!

ఈ ఏడాది బాలీవుడ్‌కి బ్యాడ్ ఫేజ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మూవీస్ విడుదల కాగా.. అందుకే కేవలం మూడంటే మూడు సినిమాలు మాత్రమే సక్సెస్‌ని అందుకున్నాయి. అవి అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి(Gangubai Kathiawadi)’, కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భూలయ్యా 2’, అనుపమ్ ఖేర్ నటించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files)’ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అంతేకాకుండా.. అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్ (Aamir Khan), రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు డిజాస్టర్స్‌గా మిగిలాయి. ముఖ్యంగా వాటిలో విడుదలకి ముందు ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన మూవీ ఆమీర్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’. దాదాపు నాలుగేళ్ల గ్యాపు తర్వాత ఈ స్టార్ సినిమా కావడం.. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.


ఈ తరుణంలోనే.. 2013లో సత్యమేవ జయతే షోలో ఆమీర్ చేసిన ‘భారతదేశంలో అసహనం’ పెరుగుతుందనే వ్యాఖ్యల కారణంగా.. అలాగే కరీనా కపూర్ నెపోటిజంపై మాట్లాడుతూ.. స్టార్ కిడ్స్ నచ్చకపోతే మా సినిమాలు చూడకండి అంటూ వెటకారంగా మాట్లాడడంతో ఈ సినిమాని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. దాంతో ఈ మూవీ థియేటర్స్‌లో విడుదలై బడ్జెట్‌లో సగం కూడా రాబట్టలేక చతికిలాపడింది. అయితే.. ఈ మూవీ ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం మంచి కలెక్షన్లని రాబట్టింది. దాంతో ఈ ఏడాది అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. 


రిపోర్టు ప్రకారం.. లాల్ సింగ్ చడ్డా విడుదలైన వారంలో $7.5 మిలియన్ (రూ. 59.82 కోట్లు) వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ ప్రస్తుతం రూ.125.99 కోట్లు. అయితే హిట్‌ సినిమాలైన.. గంగూబాయి కతియావాడి మొత్తం $7.47 మిలియన్లు (రూ.59.58కోట్లు), భూల్ భూలయ్యా 2 మొత్తం $5.88 మిలియన్లు (రూ.46.26 కోట్లు), ది కాశ్మీర్ ఫైల్స్ మొత్తం $5.7 మిలియన్లు (రూ.45.46 కోట్లు) వరకూ ఓవర్సీస్ కలెక్షన్లను సాధించాయి. కాగా.. ఆమీర్ ఖాన్‌కి చైనాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ.. ఇంకా అక్కడ ఈ సినిమా విడుదల కాలేదు. కాగా.. ఇండియాలో వసూళ్ల పరంగా వెనుబడినప్పటికీ.. ఓవర్సీస్‌లో మాత్రం హిట్ సినిమాల కంటే ముందు వరుసలో ఉండడం గమనార్హం.

Updated Date - 2022-08-24T18:19:16+05:30 IST