Aamir Khan: హాలీవుడ్ మేకర్స్‌కు బాలీవుడ్ హీరో విందు

ABN , First Publish Date - 2022-07-22T01:23:28+05:30 IST

విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). కొత్ రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా

Aamir Khan: హాలీవుడ్ మేకర్స్‌కు బాలీవుడ్ హీరో విందు

విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌‌లో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అతడు నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ (The Gray Man). ఆంటోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వం వహించారు. ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఇవాన్స్, అనా డి. ఆర్మాన్, జెస్సికా హెన్విక్, రెజ్-జీన్ పేజ్ కీలక పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ మూవీ జులై 22నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో ముంబైలో ఈ మూవీ ప్రత్యేక ప్రదర్శనను జులై 20న ఏర్పాటు చేశారు. ఈ  ప్రదర్శనకు రుస్సో బ్రదర్స్, ధనుష్ హాజరయ్యరు. రుస్సో బ్రదర్స్ భారత్‌కు విచ్చేసిన సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ వారికీ విందు ఇచ్చాడు. గుజరాతీ వంటకాలను రుచి చూపించాడు. ఈ విందుకు ధనుష్ కూడా హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 


ఆంటోనీ రుస్సో, జో రుస్సో  ‘ది గ్రే మ్యాన్’ ప్రీమియర్‌కు ఆమిర్ ఖాన్‌(Aamir Khan) ను ఆహ్వానించారు. కానీ, ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటంతో అతడు హాజరు కాలేకపోయాడు. అయినప్పటికీ కొంచెం వీలు చేసుకుని రుస్సో బ్రదర్స్‌ను  ఆమిర్ ఇంటికి ఆహ్వానించాడు. గుజరాతీ వంటకాలను రుచి చూపించాడు. ఈ విందుకు ఆమిర్ మాజీ భార్య కిరణ్ రావ్ కూడా హాజరయింది. ఇక కెరీర్ విషయానికి వస్తే..ఆమిర్ తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’‌కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Updated Date - 2022-07-22T01:23:28+05:30 IST