సౌత్ ఇండియన్ స్టార్ హీరోకి.. బాలీవుడ్ సూపర్ స్టార్ ‘సారీ’!

ABN , First Publish Date - 2021-11-24T03:35:54+05:30 IST

ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా 2021 ఏప్రెల్ 14న విడుదల కానుంది. అయితే, అదే రోజు ‘కేజీఎప్ 2’ కూడా జనం ముందుకొస్తోంది. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు రిలీజైతే బాక్సాఫీస్ వద్ద పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇదే అంశంపై చర్చ సాగుతోంది...

సౌత్ ఇండియన్ స్టార్ హీరోకి.. బాలీవుడ్ సూపర్ స్టార్ ‘సారీ’!

ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా 2021 ఏప్రెల్ 14న విడుదల కానుంది. అయితే, అదే రోజు ‘కేజీఎప్ 2’ కూడా జనం ముందుకొస్తోంది. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు రిలీజైతే బాక్సాఫీస్ వద్ద పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇదే అంశంపై చర్చ సాగుతోంది. కాకపోతే, ఏప్రెల్ 14వ తేదీనే ‘లాల్ సింగ్ చద్దా’గా తాను ప్రేక్షకుల ముందుకి ఎందుకు రావాలనుకుంటున్నాడో ఆమీర్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు... 


ఆమీర్ ఖాన్ తన కెరీర్‌లో మొదటి సారి ‘లాల్ సింగ్ చద్దా’ అనే సిక్కు మతస్థుడి క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. గతంలో ఆయనెప్పుడు తలపై పగిడితో పూర్తి స్థాయి సిక్కు యువకుడిగా కనిపించలేదు. అందుకే, తన సినిమాని పంజాబ్‌లో ప్రధాన పండుగ అయిన ‘బైసాకీ‘ వేళ విడుదల చేయాలనుకున్నాడట. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులు ఏప్రెల్ 13, 14వ తేదీల్లో ‘బైసాకీ’ జరుపుకోనున్నారు. అందుకే, అప్పుడే ఆమీర్ ఖాన్ వచ్చేస్తున్నాడు. కానీ, అదే సమయంలో ‘కేజీఎప్’ రాకీ భాయ్‌ కూడా బరిలో దిగుతున్నాడు! 


కన్నడ సినిమాగా మొదలై తెలుగు, హిందీ భాషల్లోనూ భారీ వసూళ్లు చేసింది ‘కేజీఎప్’. దాంతో ఇప్పుడు ‘కేజీఎప్ 2’పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. బాలీవుడ్‌లోనూ డబ్బింగ్ సినిమా లాగా కాక ప్యాన్ ఇండియా రేంజ్‌ మూవీగా ‘కేజీఎఫ్’ సీక్వెల్ సంచలనానికి సిద్ధం అవుతోంది. అటు ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా అనేక రోజులుగా సెట్స్ మీద ఉండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి అఫీషియల్ హిందీ రీమేక్ ‘లాల్ సింగ్ చద్దా’. పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ సినిమాలో ఎలా నటించి ఉంటాడని చాలా మందిలో ఆసక్తి నెలకొంది. అందుకే, రెండు చిత్రాల కోసం మూవీ లవ్వర్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు...


ఏప్రెల్ 14న ‘కేజీఎఫ్ 2’ విడుదల రోజే ‘లాల్ సింగ్ చద్దా’ కూడా రిలీజ్ చేస్తున్నందుకు ‘సారీ’ చెప్పాడట ఆమీర్ ఖాన్. సినిమా హీరో యశ్‌కే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కి కూడా ప్రత్యేకంగా పోన్ చేసి క్షమాపణ చెప్పాడట. ‘బైసాకీ’ వేళ సిక్కుల ముందుకు తాను ‘లాల్ సింగ్ చద్దా’గా రావాలని భావిస్తున్నట్టు వారికి వివరణ ఇస్తే అర్థం చేసుకున్నారని ఆమీర్ అంటున్నాడు. చూడాలి మరి, ‘కేజీఎఫ్ 2’ మాస్ వర్కవుట్ అవుతుందో... లేక ‘లాల్ సింగ్ చద్దా’ క్లాస్ సక్సెస్ సాధిస్తుందో... 

Updated Date - 2021-11-24T03:35:54+05:30 IST