Aamir Khan's daughter: తండ్రి ముందు బికినీ వేసుకుంటావా అంటూ ట్రోలింగ్.. దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చిన ఐరా ఖాన్

ABN , First Publish Date - 2022-05-15T16:30:42+05:30 IST

గత కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పుట్టిన రోజు చేసుకున్న సంగతి తెలిసిందే...

Aamir Khan's daughter: తండ్రి ముందు బికినీ వేసుకుంటావా అంటూ ట్రోలింగ్.. దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చిన ఐరా ఖాన్

కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పుట్టిన రోజు చేసుకున్న సంగతి తెలిసిందే. బర్త్ డే సందర్భంగా ఐరా, తన కుటుంబ సభ్యులతో కలిసి పూల్ పార్టీని జరుపుకుంది. దానికి సంబంధించిన పిక్స్‌ని ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఐరా బికినీ వేసుకొని ఉంది. అంతేకాకుండా అక్కడే తండ్రి ఆమీర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దీంతో ‘తండ్రి ముందు అలా బికినీలో ఉండడం ఏంటి?’ నెటిజన్లు ఐరాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు.


ఈ ట్రోలింగ్స్‌పై ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులతోపాటు పలువురు నెటిజన్లు సైతం ఐరాకి మద్ధతుగా నిలిచారు. తాజాగా ఈ ట్రోలింగ్స్‌పై ఐరా డిఫరెంట్‌గా స్పందిస్తూ మరికొన్ని బికిని ఫొటోలని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాకుండా ఆ పిక్స్‌కి.. ‘నేను ఇంతకుముందు షేర్ చేసిన నా పుట్టిన రోజు ఫొటోలను అసహ్యించుకోవడం, ద్వేషించడం పూర్తి అయ్యిందా.. అయితే ఇక్కడ అలాంటివి మరికొన్ని ఉన్నాయి’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనిపై ఎంతోమంది ఐరా సపోర్టర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందులో.. ‘ట్రోలర్స్‌కి ఏం రిప్లై ఇచ్చావు’, ‘మంచి పని చేశావు.. అలాగే ఉండు’, ‘అందరికీ చెంప పగిలేలా సమాధానం ఇచ్చావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోవైపు మరికొందరు ఎప్పటిలాగే విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.





Updated Date - 2022-05-15T16:30:42+05:30 IST