విడిపోయారు... కొడుకు కోసం కలిశారు!

ABN , First Publish Date - 2021-12-02T18:53:14+05:30 IST

భార్యాభర్తలు విడిపోతే కనీసం ముఖాలు కూడా చూసుకునే వారు కాదు గతంలో. ప్రేమికులు విడిపోతే కూడా అంతే. కానీ, బాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. బ్రేకప్ తరువాత కూడా దీపిక, రణబీర్ లాంటి ఎక్స్ లవ్వర్స్ ఎంచక్కా సినిమాలు చేస్తున్నారు. అదే బాటలో నడుస్తున్నారు పెళ్లై విడిపోయిన మాజీ భార్యాభర్తలు కూడా...

విడిపోయారు... కొడుకు కోసం కలిశారు!

భార్యాభర్తలు విడిపోతే కనీసం ముఖాలు కూడా చూసుకునే వారు కాదు గతంలో. ప్రేమికులు విడిపోతే కూడా అంతే. కానీ, బాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. బ్రేకప్ తరువాత కూడా దీపిక, రణబీర్ లాంటి ఎక్స్ లవ్వర్స్ ఎంచక్కా సినిమాలు చేస్తున్నారు. అదే బాటలో నడుస్తున్నారు పెళ్లై విడిపోయిన మాజీ భార్యాభర్తలు కూడా. తాజా ఉదాహరణ... ఆమీర్ ఖాన్, కిరణ్ రావ దంపతులే...

కొన్నాళ్ల క్రితం తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ఆమీర్, కిరణ్ రావ్ తెలిపారు. అప్పట్లో అందరూ షాక్ అయ్యారు. అయితే, ఆమీర్‌కు గతంలో రీనా దత్తాతోనూ విడాకులు తప్పలేదు. అయితే, ఆమెతో ఒక్కసారి వేరుపడ్డాక బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఎప్పుడూ, ఎక్కడా కలసి కనిపించలేదు. కిరణ్ రావ్‌తో మాత్రం ఆమీర్ బంధం విభిన్నంగా కొనసాగుతోంది. వారిద్దరూ కేవలం భార్యాభర్తలుగా మాత్రమే దూరమయ్యారు. కొడుకు ఆజాద్‌కు తల్లిదండ్రులుగా ఇంకా కలిసే ఉన్నారు. అందుకు నిదర్శనంగా ఓ ఫోటో బయటపడింది తాజాగా...


రచయిత్రి, ఫిల్మ్ క్రిటిక్ శోభా డే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమీర్, కిరణ్ రావ్, ఆజాద్ కలసి ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసింది. ‘‘చక్కటి ఆహారంతో గడిచిన ఆహ్లాదకరమైన ఓ సాయంత్రం’’ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చింది. నిజానికి అది నవంబర్ 25 నాటి బర్త్ డే సెలబ్రేషన్ పిక్. ఆమీర్, కిరణ్ తనయుడు ఆజాద్‌కు పదేళ్లు నిండటంతో దగ్గరి వారితో కలసి వారు పార్టీ చేసుకున్నారు. దానికి అటెండ్ అయిన శోభా డే అక్కడి హ్యాపీ పిక్ ఒకటి నెటిజన్స్‌తో షేర్ చేసింది. ఇప్పుడు అదే వైరల్ అవుతోంది. అనివార్య కారణాలతో తామిద్దరూ విడిపోయినా పిల్లాడి కోసం ఆమీర్, కిరణ్ ఒక్క చోటకి చేరటం అందర్నీ ఆనందపరిచింది. ఫ్యాన్స్ ‘‘పేరెంట్స్‌గా వారు బాధ్యత నిర్వర్తించా’’రని మెచ్చుకుంటున్నారు... 

Updated Date - 2021-12-02T18:53:14+05:30 IST