Laal Singh Chaddha: నష్టాలను భరిస్తానంటున్న ఆమిర్ ఖాన్

ABN , First Publish Date - 2022-09-01T02:06:14+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan). అతడు తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అమెరికన్ ఫిలిం ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump)కు

Laal Singh Chaddha: నష్టాలను భరిస్తానంటున్న ఆమిర్ ఖాన్

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). అతడు తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అమెరికన్ ఫిలిం ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump)కు రీమేక్‌గా రూపొందింది. కరీనా కపూర్ (Kareena Kapoor), నాగచైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలు పోషించారు. వయాకాం 18 స్టూడియోస్‌తో కలసి ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల అయింది. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఆమిర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. పూర్తి రన్‌లో కేవలం రూ. 60కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఈ సినిమాకు వచ్చిన నష్టాలను భరిస్తానని ఆమిర్ నిర్మాతలకు మాటిచినట్టు తెలుస్తోంది. సినిమా పారితోషికాన్ని కూడా తీసుకోలేదని సమాచారం.  


బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ రెమ్యూనరేషన్‌ను తీసుకుంటే వయాకాం 18స్టూడియోస్ రూ.100కోట్ల నష్టాలను భరించాల్సి ఉంటుంది. కానీ, హీరో పారితోషికాన్ని తీసుకోకపోవడంతో ఆ నష్టం పరిమితంగా ఉంటుందని తెలుస్తోంది. సినిమా కోసం ఆమిర్ నాలుగేళ్లు శ్రమించాడు. కానీ, పరాజయంతో దమ్మిడి ఆదాయం కూడా రాలేదు. అందువల్లే అతడు పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తున్నాడు. ఒక వేళ మూవీ మాత్రం హిట్ అయితే మాత్రం అతడు భారీగా అర్జించే అవకాశం ఉండేది. ‘లాల్ సింగ్ చడ్డా’ కు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అతుల్ కులకర్ణి స్క్రీన్ ప్లేను అందించాడు. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. ఓవర్సీస్‌లో మాత్రం ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టడం విశేషం. 

Updated Date - 2022-09-01T02:06:14+05:30 IST