బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న ‘ఆకాశం నీ హద్దురా’ హీరోయిన్

ABN , First Publish Date - 2022-03-11T22:40:59+05:30 IST

‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన నటి అపర్ణ బాల మురళి

బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న ‘ఆకాశం నీ హద్దురా’ హీరోయిన్

‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన నటి అపర్ణ బాల మురళి. సూర్య సరసన హీరోయిన్‌గా నటించి అభిమానులను మైమరపించింది. ఆమె తన తర్వాతి సినిమాకు సన్నద్ధమవుతోన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బాక్సింగ్‌ను నేర్చుకుంటోన్న వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. గ్లోవ్స్ ఎమోజీని క్యాప్షన్‌గా ఇచ్చింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు ఈ వీడియో కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఈ వీడియో కింద కామెంట్ చేసింది. ‘‘నేను కూడా బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను’’ అని ఆమె చెప్పింది. ఇక కెరీర్ పరంగా... అపర్ణ  వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. 


అపర్ణ బాల మురళి ప్రస్తుతం ‘సుందరి గార్డెన్’ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. నీరజ్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కార్తి, ఉన్ని ముకందన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆమె అవకాశాలు దక్కించుకుంది.



Updated Date - 2022-03-11T22:40:59+05:30 IST