Tees Maar Khan Trailer: మా అమ్మ జోలికొస్తే.. ఏ అమ్మ కొడుకైనా కొడతా!

ABN , First Publish Date - 2022-08-09T01:05:38+05:30 IST

ఆది సాయికుమార్ (Aadi Saikumar), పాయల్ రాజ్‌పుత్ (Paayal Rajput) హీరోహీరోయిన్లుగా విజన్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా తెరకెక్కిన చిత్రం ‘తీస్ మార్ ఖాన్’ (Tees Maar Khan). ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ

Tees Maar Khan Trailer: మా అమ్మ జోలికొస్తే.. ఏ అమ్మ కొడుకైనా కొడతా!

ఆది సాయికుమార్ (Aadi Saikumar), పాయల్ రాజ్‌పుత్ (Paayal Rajput) హీరోహీరోయిన్లుగా విజన్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా తెరకెక్కిన చిత్రం ‘తీస్ మార్ ఖాన్’ (Tees Maar Khan). ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ (Kalyanji Gogana) దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి (N Tirupathi Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది.


2 నిమిషాల 42 సెకనుల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్‌.. ‘‘మా అమ్మను తప్పుగా చూశారు.. మా అమ్మ జోలికొస్తే ఏ అమ్మ కొడుకైనా కొడతా’ అనే పదునైన డైలాగ్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ చూపించి.. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో తెలిపారు. పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయి కుమార్ ఎలివేషన్ హైలైట్ చేస్తూనే కామెడీ పండించడం ఆసక్తికరంగా ఉంది. ‘ఇలాంటి అందమైన అమ్మాయిలు అంత అందంగా డాన్స్ చేస్తుంటే ఎంత ఖర్చు పెడితే వస్తాయి చెప్పండి ఇలాంటి విజువల్స్’..  అని ఆది సాయి కుమార్ చెప్పిన డైలాగ్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సీన్స్.. యూత్‌ని ఆకర్షిస్తే, సునీల్ (Sunil), పూర్ణ (Poorna)లతో వచ్చే సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌కి మరో హైలైట్. మొత్తంగా చూస్తే ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచడమే కాకుండా వెయిట్ చేసేలా చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ‘పోలీస్ స్టోరీ’ చిత్రంతో సాయికుమార్ ఓ హిస్టరీని క్రియేట్ చేసినట్లుగానే.. ఈ చిత్రంతో హీరో ఆది కూడా పోలీస్‌గా సాలిడ్ హిట్‌ కొట్టేలానే ఉన్నాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Tees Maar Khan Trailer)



Updated Date - 2022-08-09T01:05:38+05:30 IST