ఓ ఇంటివాడైన Aadhi pinisetty

ABN , First Publish Date - 2022-05-19T20:47:32+05:30 IST

‘ఒక వి చిత్రం’, ‘గుండెల్లో గోదారి’, ‘సరైనోడు’, ‘రంగస్థలం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆది పినిశెట్టి (Aadhi pinisetty)ఓ ఇంటి వాడైయాడు. కన్నడ హీరోయిన్‌ నిక్కీగల్రాని(Nikki galrani)తో ఆయన వివాహం బుధవారం చెన్నైలో ఘనంగా జరిగింది.

ఓ ఇంటివాడైన Aadhi pinisetty


‘ఒక వి చిత్రం’, ‘గుండెల్లో గోదారి’, ‘సరైనోడు’, ‘రంగస్థలం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆది పినిశెట్టి (Aadhi pinisetty)ఓ ఇంటి వాడైయాడు. కన్నడ హీరోయిన్‌ నిక్కీగల్రాని(Nikki galrani)తో ఆయన వివాహం బుధవారం చెన్నైలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. నాని, సందీప్‌ కిషన్‌ తదితరులు సంగీత్‌తో సందడి చేశారు. 


ఆది పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలు చూసిన అభిమానులు  నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆది–నిక్కీ పలు తమిళ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలతో  మొదలైన స్నేహం ప్రేమగా మారింది. కొన్నేళ్లగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. నెల రోజుల క్రితం బంధువుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు మూడు ముళ్లతో ఒకటయ్యారు. 






Updated Date - 2022-05-19T20:47:32+05:30 IST