‘నువ్వేంట్రా మరీ ఇలా చేస్తున్నావ్‌’.. అని అమ్మ భయపడింది: ఆది పినిశెట్టి

ABN , First Publish Date - 2022-07-15T21:26:23+05:30 IST

ప‌వ‌ర్‌ఫుల్ విలన్ గురు(Guru) పాత్రలో యువ కథానాయకుడు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) నటించిన చిత్రం ‘ది వారియర్’ (The Warriorr). ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), కృతి శెట్టి (Krithi Shetty) హీరోహీరోయిన్లుగా

‘నువ్వేంట్రా మరీ ఇలా చేస్తున్నావ్‌’.. అని అమ్మ భయపడింది: ఆది పినిశెట్టి

ప‌వ‌ర్‌ఫుల్ విలన్ గురు(Guru) పాత్రలో యువ కథానాయకుడు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) నటించిన చిత్రం ‘ది వారియర్’ (The Warriorr). ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), కృతి శెట్టి (Krithi Shetty) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. తమిళ అగ్ర దర్శకుడు లింగుసామి (Lingusamy) దర్శకత్వంలో తెరకెక్కింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై.. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ.. 

‘‘ది వారియ‌ర్‌ చిత్రంలో గురు పాత్రకు వ‌స్తున్న స్పంద‌న చాలా సంతోషాన్ని క‌లిగిస్తోంది. నా పాత్ర కాస్త వైలెంట్‌గా ఉంటుంది. అది చూసి మా అమ్మ భ‌య‌ప‌డిపోయింది. ‘నువ్వేంట్రా మరీ ఇలా చేస్తున్నావ్‌’ అని అడిగింది. చిన్న పిల్లల్ని ఎత్తుకోవ‌డానికి వెళ్తే.. వాళ్లూ భ‌య‌ప‌డుతున్నారు.


గురు అనేది రొటీన్ విల‌న్ పాత్ర కాదు. వ‌చ్చి నాలుగు ఫైట్లు చేసి వెళ్లిపోయే క్యారెక్టర్ కాదు. ఆ క్యారెక్టర్‌కి ఓ గ్రాఫ్ ఉంది. త‌న వెనుక ఓ స్టోరీ ఉంది. గురు ఇలా ఎందుకు మారాడు? ఎలా గ్యాంగ్‌స్టర్ అయ్యాడు?  అనే క‌థ నాకు న‌చ్చింది. అందుకే ఈ పాత్ర చేశాను. సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 


హీరోనా, విల‌నా?  అనే తేడాలు నేను చూడ‌ను. న‌టుడిగా ఆ పాత్రకు ఏం చేయాలో.. అవి చేయ‌గ‌ల‌నా?  న‌న్ను నేను కొత్తగా నిరూపించుకోగ‌ల‌నా?  అనేదే ఆలోచిస్తా. ‘స‌రైనోడు’ త‌ర్వాత విల‌న్ పాత్రలు చాలా వ‌చ్చాయి. కానీ ఏదీ.. స‌రైనోడు స్థాయిలో లేక‌పోయే స‌రికి ఒప్పుకోలేదు. ‘ది వారియ‌ర్’ మాత్రం క‌థ విన‌గానే న‌చ్చింది. వెంట‌నే ఒప్పుకొన్నా.


విల‌న్‌గా చేస్తే... న‌టుడికి చాలా స్కోప్ ఉంటుంది. విల‌న్ ఎంత ఎలివేట్ అయితే.. హీరోయిజం అంత పండుతుంది. ఈ విష‌యాన్ని ఈత‌రం ద‌ర్శకులు గ్రహించారు. అందుకే విల‌న్ పాత్రలు మ‌రింత శ‌క్తివంతంగా పుట్టుకొస్తున్నాయి.


హీరో, విల‌న్ మ‌ధ్య కెమిస్ట్రీ కుద‌ర‌డం కూడా చాలా అవ‌స‌రం. ఈ సినిమాలో రామ్‌తో నా కెమిస్ట్రీ కుదిరింది. క్లైమాక్స్ ఫైట్‌లో ఇద్దరూ ఫైట్ చేసుకుంటున్నట్టు లేదు.. క‌లిసి డాన్స్ చేస్తున్నట్టు ఉంది.. అని లింగుసామిగారు చెప్పారు. ఆ మాట చాలా సంతోషాన్ని ఇచ్చింది.


తమిళ వాళ్ళు నేను తెలుగు వాడిని అనుకుంటున్నారు. తెలుగు వాళ్ళు తమిళోడిని అనుకుంటున్నారు. అది పక్కన పెడితే... ఇప్పుడు ప్రేక్షకులు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, పెర్ఫార్మన్స్ వస్తే ఆదరిస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్స్‌ చాలా ఉన్నాయి. భాషతో సినిమాకు సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను సెలబ్రేట్ చేస్తున్నారు.  


మ్యారీడ్ లైఫ్ గురించి చెప్పాలంటే.. సేమ్ లైఫ్. పెళ్ళికి ముందు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’లా ఉండేవాళ్ళమేమో!  పెళ్లి తర్వాత, ఇప్పుడు చాలా బావున్నాం. నాకూ, తనకూ మమ్మల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అంతా హ్యాపీగా ఉంది.


క‌థ‌ల ఎంపిక విష‌యంలో నాన్నగారి జోక్యం ఏమీ ఉండ‌దు. కానీ ఇద్దరం సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం. ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ చెప్పరు. నాలో నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. ఈ సినిమాలో యాస కొంచెం బాగుంటే బాగుంటుందన్నారు. కొన్ని సన్నివేశాలను నా పెర్ఫార్మన్స్ బాగుంది, నేను హైలైట్ అయ్యానంటే అది రామ్ గొప్పతనం అని చెప్పారు. అతను కొంచెం తగ్గడం వల్ల నాకు ఇంత పేరు వచ్చిందన్నారు. నాన్నగారి అనుభ‌వం నాకు చాలా ఉప‌యోగ‌ప‌డింది.


హీరోగా త‌మిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. తెలుగులో కొత్తగా రెండు సినిమాలు ఒప్పుకొన్నా.. వాటి వివ‌రాలు త్వర‌లో చెబుతాను..’’ అని ఆది పినిశెట్టి తెలిపారు.



Updated Date - 2022-07-15T21:26:23+05:30 IST