‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే!

ABN , First Publish Date - 2022-02-19T23:46:11+05:30 IST

కరోనా మహమ్మారి ఉదృతి తగ్గి.. ఇప్పుడిప్పుడే మళ్లీ సాదారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ముందుగా భారీ అంచనాలున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం ఈ ఫిబ్రవరి 25న

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే!

కరోనా మహమ్మారి ఉదృతి తగ్గి.. ఇప్పుడిప్పుడే మళ్లీ సాదారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ముందుగా భారీ అంచనాలున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం ఈ ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగిశాయి. అయితే ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రానికి ముందుగా రెండు విడుదల తేదీలను ప్రకటించారు. ఫిబ్రవరి 25 లేదంటే ఏప్రిల్ 01 అన్నట్లుగా విడుదల తేదీలను రిజర్వ్ చేయడంతో.. 100 శాతం సీటింగ్ మినహా.. ఇంకా ఏపీలోని పరిస్థితుల్లో మార్పు రాలేదు కాబట్టి ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలవడం కష్టమే అని అంతా అనుకున్నారు. అలా అనుకునే.. శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రాలను ఫిబ్రవరి 25న విడుదల చేసేందుకు.. ఆ చిత్రాల మేకర్స్ అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ, పరిస్థితులను పట్టించుకోకుండా, ఈసారి అభిమానులను డిజప్పాయింట్ చేయకూడదనే నిర్ణయంతో ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న పక్కా అనేలా సంకేతాలు ఇవ్వడంతో.. ఇప్పుడీ రెండు చిత్రాలను ఒక వారం పాటు వాయిదా వేసి, మార్చి 04వ తేదీన విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మేకర్స్ అధికారికంగా మార్చి 04న విడుదల అని పోస్టర్స్ కూడా విడుదల చేశారు. ‘గని’ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. వాయిదా మాత్రం పక్కా అనేలా వార్తలు నడుస్తున్నాయి.


‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ విషయానికి వస్తే.. శర్వానంద్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. సెన్సార్ నుండి ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిపికేట్ లభించినట్లుగా తాజాగా నిర్మాతలు అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కలర్‌ఫుల్‌గా ఉంది. పెళ్లికొడుకు అవతారంలో ఉన్న శర్వానంద్.. రష్మిక మందన్నతో పాటు కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారందరికీ నమస్కారం చేస్తున్నాడు. వారి ముఖాల్లో రకరకాల హావభావాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ఫంక్షన్‌లో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘శ‌త‌మానంభ‌వ‌తి త‌ర్వాత మ‌ళ్లీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లు చేయ‌లేదు, అలాగే మ‌హానుభావుడు వంటి మంచి ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌మ‌ని చాలా మంది అడుగుతున్నారు. ఆ సినిమాల్లో ఎలా న‌వ్వించాడో ఆ పాత శ‌ర్వా కావాల‌ని చాలా మంది అడుగుతున్నారు. వాళ్లంద‌రికీ ఒక‌టైతే క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను ఈ సినిమా చూసి వెళ్లేట‌ప్పుడు ఒక మంచి చిరున‌వ్వుతో, ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఇంటికి వెళ్తారు’’ అని తెలిపారు. కాగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.



Updated Date - 2022-02-19T23:46:11+05:30 IST