Aa Ammayi Gurinchi Meeku Cheppali: ‘మీరే హీరోలా’ పాట వారికి అంకితం

ABN , First Publish Date - 2022-08-18T02:57:43+05:30 IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu), దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti) కాంబినేషన్‌లో విలక్షణమైన ప్రేమకథగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali). సుధీర్ బాబు సరసన

Aa Ammayi Gurinchi Meeku Cheppali: ‘మీరే హీరోలా’ పాట వారికి అంకితం

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu), దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti) కాంబినేషన్‌లో విలక్షణమైన ప్రేమకథగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali). సుధీర్ బాబు సరసన కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌‌పై బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘మీరే హీరోలా’ అనే పాటని పాత్రికేయుల సమక్షంలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ‘సీతా రామం’ (Sita Ramam) దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ సాంగ్‌ను ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఏ సినిమాలైనా సరే.. ఆడియన్స్‌కి కనెక్ట్ చేయడానికి జర్నలిస్ట్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. ఒక మంచి సినిమా వస్తే.. సినిమా యూనిట్ కంటే కూడా వారే ఎక్కువ ప్రమోట్ చేస్తారు. నటీనటులకు ఎంత ప్యాషన్ వుంటుందో జర్నలిస్టులు కూడా అంతే ప్యాషన్‌తో పని చేస్తారు. ‘మీరే హీరో’ పాటను మీడియా సమక్షంలో విడుదల చేయడం ఆనందంగా వుంది. ఈ పాటని పాత్రికేయులకు డెడికేట్ చేస్తున్నాం. ఇంద్రగంటి‌గారితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కృతి ఇందులో అద్భుతమైన పాత్ర చేసింది. ‘ఉప్పెన’ వల్ల ఆమెకు పది సినిమాలు వస్తే ఈ సినిమాతో కృతి టాలీవుడ్‌లో స్థిరపడిపోతుంది. ఎలాంటి పాత్రనైనా చేయగలననే నమ్మకం ఆమెకు ఈ సినిమా ఇస్తుందని భావిస్తున్నా. సినిమా చాలా రిచ్‌గా వుంటుంది. మహేష్ బాబు సినిమా ఎంత రిచ్‌గా వుంటుందో.. ఈ సినిమాలో కూడా అంతే రిచ్‌నెస్ వుంటుంది. హను రాఘవపూడిగారు నాకు ఇష్టమైన దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలవుతుంది. ఇంద్రగంటిగారి బెస్ట్ మూవీ ఇది. ప్రేమకథతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా వుంటుంది..’’ అని తెలిపారు.


దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను కూడా జర్నలిస్ట్‌గా పని చేశాను. చాలా ఇంటర్వ్యూ లు చేశాను. ఒక ఇంటర్వ్యూ తరహాలో హీరో ఇంట్రో సాంగ్ వుంటే ఎలా వుంటుందనే ఆలోచనని రామజోగయ్య శాస్త్రి‌గారికి చెప్పాను. ఆయన వెంటనే నన్ను పాతిక ప్రశ్నలు అడిగారు. చిన్న ఎత్తిపొడుపు, చమత్కారం, చిన్న సంఘర్షణ .. ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ పాట కంపోజిషన్ ఒక సవాల్‌తో కూడుకున్నది. సంభాషణని సంగీతంలో ఇమడ్చడం కష్టమైన ప్రక్రియ. వివేక్ వండర్ ఫుల్‌గా కంపోజ్ చేశారు. దినేష్ దీనికి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. మీరే హీరోలాగ పాట క్రెడిట్ రామజోగయ్య శాస్త్రి, దినేష్, వివేక్‌కి దక్కుతుంది. సుధీర్ నా ఫేవరేట్ నటుడు. ఇందులో కూడా అద్భుతమైన నటనను కనబరిచాడు. కృతిని ‘ఉప్పెన’ కంటే ముందే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా కొత్త కృతి కనిపిస్తుంది. నిర్మాతలకు మంచి అభిరుచి వుంది. ఈ సినిమాని సపోర్ట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవి గారికి కృతజ్ఞతలు.ఇది నా మోస్ట్ ఎమోషనల్ ఫిల్మ్. అలాగే ఈ పాట కూడా మోస్ట్ ఫేవరేట్ సాంగ్. మంచి కంటెంట్ వుంటే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారని దర్శకుడు హను నిరూపించారు. ఆయనకి అభినందనలు. ఈ పాటను నా ప్రెస్, మీడియా ఫ్రెండ్స్‌కి అంకితం చేస్తున్నా..’’ అని అన్నారు.

Updated Date - 2022-08-18T02:57:43+05:30 IST