Second Alia Bhatt: చూడటానికి అచ్చం Alia Bhatt లాగా ఉన్న ఈమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-12T19:29:01+05:30 IST

మనుషులను పోలిన మనుషులు ఉండడం సహజమే. మరి అచ్చుగుద్దినట్లు కాకపోయినప్పటికీ వారిని చూస్తే మరేవరినో..

Second Alia Bhatt: చూడటానికి అచ్చం Alia Bhatt లాగా ఉన్న ఈమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..

మనుషులను పోలిన మనుషులు ఉండడం సహజమే. మరి అచ్చుగుద్దినట్లు కాకపోయినప్పటికీ వారిని చూస్తే మరేవరినో చూసినట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీలను పోలి ఉంటే మాత్రం వారు సెన్సెన్‌గా మారడం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అలా ఎందరో ఉన్నారు. అలాంటి వారిని ఫేమస్ చేయడంలో సోషల్ మీడియా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్‌ పోలికలతో ఉన్న ఓ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.


అలియా కొత్త చిత్రం ‘గంగుభాయి కతియావాడి’ లుక్‌తో ‘దిల్ తో పాగల్ హై’ చిత్రంలోని ‘కబ్ తక్ చుప్ బైతే’ అనే రిమీక్స్ పాటకి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సెలెస్టి బైరాగే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ అయ్యింది. 3 లక్షలకి పైగా లైక్స్ సంపాదించుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎంతోమంది నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. 


అందులో.. ‘నువ్వు అచ్చం అలియాలాగే ఉన్నావు’ అంటూ కొందరు.. ‘నిజంగా అలియానే అనుకున్నా’ అని మరికొందరు.. ‘రెండో అలియా’ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలియాను పోలి ఉన్న ఆ అమ్మాయి అసలు పేరేంటో తెలియదు. కానీ ఆమె అస్సాంకి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఆమె గత కొంతకాలంగా క్రమం తప్పకుండా అలియాను అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతోంది. ముఖ్యంగా గతేడాది నవంబర్‌లో రాజస్థాన్ వీధుల్లో ఆమె చేసిన వీడియో ఇంటర్నెట్‌లో బాగా ఫేమస్ అయింది. అలియా భట్‌ని పోలి ఉన్న ఈమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షల 16 వేలకి పైగా ఫాలోవర్స్ ఉండడం గమనార్హం.



Updated Date - 2022-05-12T19:29:01+05:30 IST