ఎయిర్‌పోర్ట్‌లో అందరి ముందు... Aryan మూత్ర విసర్జన చేశాడంటూ... దుష్ప్రచారం

ABN , First Publish Date - 2022-01-04T22:36:51+05:30 IST

సొషల్ మీడియాలో నిజాలు, అబద్ధాలు రెండూ చక్కర్లు కొడుతుంటాయి. అయితే, నిజాల కంటే ఎక్కువగా అబద్ధాలు జనాల్ని మాయ చేస్తుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. మరోసారి అదే జరిగింది...

ఎయిర్‌పోర్ట్‌లో అందరి ముందు... Aryan మూత్ర విసర్జన చేశాడంటూ... దుష్ప్రచారం

సొషల్ మీడియాలో నిజాలు, అబద్ధాలు రెండూ చక్కర్లు కొడుతుంటాయి. అయితే, నిజాల కంటే ఎక్కువగా అబద్ధాలు జనాల్ని మాయ చేస్తుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. మరోసారి అదే జరిగింది. కొన్నాళ్ల క్రితం షారుఖ్ ఖాన్ తనయుడు అమాంతం వార్తల్లో వ్యక్తి అయిపోయాడు. అందుక్కారణం అక్టోబర్ 2, గాంధీ జయంతి వేళ అతను మరికొందరితో పాటూ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావటమే. ఇంచుమించూ నెల రోజులు జైల్లో గడిపిన ఆర్యన్ ఎట్టకేలకు బెయిల్ మీద బయటకొచ్చాడు. అయితే, ఆర్యన్ కేసు విషయంలోనూ ఎప్పటిలాగే సొషల్ మీడియా రెండు విడిపోయింది. కొందరు తప్పన్నారు. మరికొందరు ఆర్యన్ మీద కుట్ర జరిగిందంటూ సానుభూతి చూపారు.


ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు కలకలం మీడియాలో పూర్తిగా సద్దుమణిగిన వేళ... ఓ వీడియో మరోసారి బాద్‌షా వారసుడ్ని సోషల్ మీడియాలో చర్చకు తెచ్చింది. అతడు ఓ విదేశీ విమానాశ్రయంలో మత్తులో తూగుతూ అందరి ముందు నానా రచ్చ చేశాడని జనం చెప్పుకుంటున్నారు. వైరల్‌గా మారిన ఒక ఓల్డ్ వీడియోలో ఓ యువకుడు ఎయిర్‌పోర్ట్‌లోనే పబ్లిగ్గా యూరినేట్ చేస్తూ కనిపించాడు. అతను ఆర్యన్ ఖానే అంటున్నారు కొందరు నెటిజన్స్. అయితే, చాలా మంది మాత్రం కాదనే భావిస్తున్నారు. అతను మరెవరో అంటూ కొట్టిపారేస్తున్నారు.


సొషల్ మీడియాలో ఆర్యన్ ఖాన్ ఎయిర్ పోర్ట్ వీడియో ఎవరు మొదట షేర్ చేశారోగానీ... చివరకు అది పెద్ద చర్చగా మారింది. అయితే, కొందరు సదరు వీడియోలో కనిపించిన వ్యక్తి ఎవరో కనిపెట్టగలిగారు. అతని పేరు బ్రోన్సన్ పెల్లెటియర్. కెనడా దేశానికి చెందిన నటుడు. 2012లో అతను తీవ్రమైన మత్తులో ఉండగా విమానాశ్రాయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అతను కాస్త ఆర్యన్ ఖాన్‌లా ఉండటంతో అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ చేసేశారు మన నెటిజన్స్!    

Updated Date - 2022-01-04T22:36:51+05:30 IST