తెర మీదకు HOLLYWOOD వయొలెంట్ ROMANCE

ABN , First Publish Date - 2021-11-21T20:13:42+05:30 IST

హాలీవుడ్ సూపర్ స్టార్స్ జానీ డెప్, యాంబర్ హెర్డ్ రియల్ లైఫ్ రొమాన్స్ చాలా రోజులు వార్తల్లో నిలిచింది. అయితే, వారు విడిపోయినప్పుడు కూడా అదే రేంజ్లో చర్చ సాగింది. తీవ్రమైన గొడవలు, ఆరోపణలు, కోర్టు కేసుల నడుమ జానీ, యాంబర్ బ్రేకప్ చేసుకున్నారు. కానీ...

తెర మీదకు HOLLYWOOD వయొలెంట్ ROMANCE

హాలీవుడ్ సూపర్ స్టార్స్ జానీ డెప్, యాంబర్ హెర్డ్ రియల్ లైఫ్ రొమాన్స్ చాలా రోజులు వార్తల్లో నిలిచింది. అయితే, వారు విడిపోయినప్పుడు కూడా అదే రేంజ్లో చర్చ సాగింది. తీవ్రమైన గొడవలు, ఆరోపణలు, కోర్టు కేసుల నడుమ జానీ, యాంబర్ బ్రేకప్ చేసుకున్నారు. కానీ, ఇంకా వారి మధ్య కోర్టు కేసుల పరంపర సాగుతూనే ఉంది.

ఒక వైపు లీగల్ బ్యాటిల్ కంటిన్యూ చేస్తూనే మరో వైపు తమ పెటాకులైన పెళ్లి గురించి పబ్లిగ్గా మాట్లాడటానికి రెడీ అయ్యారు హాలీవుడ్ స్టార్ కపుల్. త్వరలో వీరిద్దరి ప్రేమ, పెళ్లి, తరువాత జరిగిన వివాదాలు, చివరకు విడిపోవటం గురించి డిస్కవరీ ప్లస్‌లో ఓ డాక్యు సిరీస్ రానుంది. రెండు భాగాలుగా రూపొందిన డాక్యుమెంటరీలో మొదటి భాగం జానీ డెప్ వర్షన్ మన ముందుంచుతుంది. అందులో ఆయన ఒకప్పటి తన భార్య యాంబర్ హెర్డ్ ఎలా తనని మోసం చేసిందీ చెబుతాడట. తన వ్యక్తిగత ఇమేజ్ కోసం యాంబర్ ఎంతకైనా తెగించి ఆరోపణలు చేస్తుందనేది డెప్ వాదన. ఇక రెండో భాగంలో యాంబర్ తన కోణంలో తమ సంసారాన్ని విశ్లేషిస్తుందట. తాను అభిమానించిన తన ఫేవరెట్ హీరోనే... పెళ్లయ్యాక ఎలా హింసించాడో ఆమె చెబుతుందట. డ్రగ్స్ తీసుకుని ఇంటికి వచ్చే జానీ డెప్ ఎలా తనని శారీరికంగా హింసించాడో యాంబర్ గతంలోనూ వివరించింది. కోర్టుకు కూడా చెప్పింది. డాక్యుమెంటరీలో మరింత వివరంగా తన చీకటి రోజుల్ని ఆమె ప్రస్తావించవచ్చని అంటున్నారు.

Updated Date - 2021-11-21T20:13:42+05:30 IST