బాలీవుడ్ సెలబ్రిటీల బిల్డింగ్స్‌లో పరీక్షలు... 108 మంది రిపోర్ట్స్ వెల్లడి! మరో 37 మంది...

ABN , First Publish Date - 2021-12-16T17:32:59+05:30 IST

బాలీవుడ్‌లో మరోసారి కరోనా కలకలం కొనసాగుతోంది. అంతే కాదు, బాలీవుడ్ సెలబ్రిటీల కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్స్‌తో వారు నివాసముండే ప్రాంతాల్లోనూ అలజడి మొదలైపోతోంది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆమెతో పాటూ మలైకా అరోరా చెల్లెలు అమృతా అరోరా కూడా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. వారిద్దరూ కరణ్ జోహర్ ఇంట్లో ఓ పార్టీకి అటెండ్ అయ్యారన్న వార్త బీ-టౌన్‌లో మరింత చర్చకు కారణమైంది...

బాలీవుడ్ సెలబ్రిటీల బిల్డింగ్స్‌లో పరీక్షలు... 108 మంది రిపోర్ట్స్ వెల్లడి! మరో 37 మంది...

బాలీవుడ్‌లో మరోసారి కరోనా కలకలం కొనసాగుతోంది. అంతే కాదు, బాలీవుడ్ సెలబ్రిటీల కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్స్‌తో వారు నివాసముండే ప్రాంతాల్లోనూ అలజడి మొదలైపోతోంది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆమెతో పాటూ మలైకా అరోరా చెల్లెలు అమృతా అరోరా కూడా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. వారిద్దరూ కరణ్ జోహర్ ఇంట్లో ఓ పార్టీకి అటెండ్ అయ్యారన్న వార్త బీ-టౌన్‌లో మరింత చర్చకు కారణమైంది... 


కరీనా, అమృతా అరోరా కోవిడ్ కలకలంతో అనేక మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్య శాఖ అధికారులు. కరణ్ జోహర్, కరీనా, అమృతా అరోరా వంటి బాలీవుడ్ ప్రముఖులు నివాసముండే చోట్లలో దాదాపుగా అందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఆయా బిల్డింగ్స్ అన్నిట్లో కలుపుకుని ఇప్పటి వరకూ 108 మందికి నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా బుధవారం వెల్లడైంది. అయితే, మరో 37 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. వారిలో ఎంత మందికి పాజిటివ్ రిజల్ట్ వస్తుందోనని ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. కాగా కరీనా కపూర్ ఇంట్లో పని చేసే ఓ ఉద్యోగికి మాత్రం ఇప్పటికే కరోనా సోకినట్టు నిర్ధారణ అయిపోయింది. 


2020లో విజృంభించిన ఫస్ట్ వేవ్, 2021లో వచ్చిన సెకండ్ వేవ్... ప్రతీసారీ మహారాష్ట్ర, ముంబై కరోనా కేసుల విషయంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇప్పుడు కొత్త వేరియెంట్ ఓమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి మహారాష్ట్ర, ముంబైలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. అందుకే, బాలీవుడ్ సెలబ్రిటీల కరోనా వార్తలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కొందరు నెటిజన్స్ బీ-టౌన్‌ పార్టీ కల్చర్‌ని కూడా తప్పుబడుతున్నారు...

Updated Date - 2021-12-16T17:32:59+05:30 IST