Godfather : చిరు - సల్మాన్ పాట షూటింగ్ పూర్తి

ABN , First Publish Date - 2022-08-01T17:29:35+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohanraja) తొలి కలయికలో తెరకెక్కుతోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్‌ఫాదర్’ (Godfather). మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

Godfather : చిరు - సల్మాన్ పాట షూటింగ్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohanraja) తొలి కలయికలో తెరకెక్కుతోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్‌ఫాదర్’ (Godfather). మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు చేస్తుండగా, మలయాళ నటుడు బిజుమీనన్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా సునీల్, బిగ్‌బాస్ ఫేమ్ దివి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్‌లో ఈ పాత్రను ఆ సినిమా దర్శకుడు పృధ్విరాజ్ సుకుమారన్ (Pridhwiraj Sukumaran) చేశారు. చిరుకు కుడిభుజం లాంటి ఆ పాత్ర సల్మాన్ ఖాన్ చేస్తుండడంతో చిత్రంపై మరింతగా హైపు క్రియేట్ అయింది. 


అసలు విషయానికొస్తే ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి మరో హైలైట్ ఏంటంటే.. ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై ఓ ప్రత్యేకమైన పాట ఉండబోతోంది. దీనికి సంగీత దర్శకుడు తమన్ (Thaman) అదిరిపోయే రీతిలో ఓ మాసీ ట్యూన్ ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల ఈ పాట చిత్రీకరణను ముంబైలో మొదలు పెట్టారు. ఈ సందర్బంగా విడుదలైన చిరంజీవి, సల్మాన్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఈ పాట షూట్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు. దీనికి ఇండియన్ మైకేల్ జాక్సన్  ప్రభుదేవా (Prabhu Deva) అద్భుతంగా కొరియోగ్రాఫీ చేయడం విశేషం. ఈ పాటలో చిరు, సల్లూభాయ్ మాస్ స్టెప్స్ అభిమానుల్ని అలరిస్తాయని చెబుతున్నారు. 


ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. అతి త్వరలో బ్యాలెన్స్ సీన్స్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసి మొత్తం టాకీ పార్ట్ ను కంప్లీట్ చేయబోతున్నారు. చిరంజీవి పుట్టినరోజు కానుకగా. అంటే ఆగస్ట్ 22న చిరు, సల్మాన్ పాట లిరికల్ సాంగ్ ను విడుదల చేస్తారని సమాచారం. ‘ఆచార్య’ (Acharya) చిత్రంతో అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచిన చిరంజీవి.. ‘గాడ్‌ఫాదర్’ చిత్రంతో మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు మేకర్స్. మరి ఈ సినిమాకి చిరంజీవి, సల్మాన్ ఖాన్ పాట ఏ స్థాయిలో హైలైట్ కానుందో చూడాలి.  




Updated Date - 2022-08-01T17:29:35+05:30 IST