Photshoot కోసం... కుక్కకి హెయిర్ dye... 5 లక్షలు ఖర్చు!

ABN , First Publish Date - 2021-11-19T21:48:06+05:30 IST

అనగనగా ఓ కుక్క. అంతే కదా... అంటారా? అది మామూలు కుక్క కాదు. రష్యాకు చెందిన ఓ గ్లామరస్ మోడల్‌గారి సెలబ్రిటీ డాగ్!

Photshoot కోసం... కుక్కకి హెయిర్ dye... 5 లక్షలు ఖర్చు!

అనగనగా ఓ కుక్క. అంతే కదా... అంటారా? అది మామూలు కుక్క కాదు. రష్యాకు చెందిన ఓ గ్లామరస్ మోడల్‌గారి సెలబ్రిటీ డాగ్! 


ప్రస్తుతం సొషల్ మీడియాలోని నెటిజన్స్‌కు టార్గెట్ అయిన సదరు ‘ప్లేబాయ్’ మోడల్ పేరు అన్నా స్టూపక్. ఆమె తన అందాల తెల్లటి కుక్కతో ఫోటోషూట్ చేయాలనుకుంది. హ్యాపీగా చేసేసుకుని ఉంటే ఏ గొడవా ఉండేది కాదు. కానీ, అన్నా స్టూపక్‌కి వెరైటీ ఐడియా వచ్చింది. ఫోటోషూట్ కోసం తన కుక్క పిల్ల కలర్‌నే మార్చేసింది. దాని ఒంటి మీదున్న వెంట్రుకలన్నీ డై చేయించింది. ఎంతో కష్టపడి తన శునకరాజానికి రంగు వేయించానని ఆన్‌లైన్‌లో ప్రకటించింది కూడా!


ఓ ఫోటోషూట్ కోసం తన కుక్కకి ఆరెంజ్ రంగు వేయించాననీ చెప్పిన క్రేజీ రష్యన్ మోడల్, అందుకోసం ఖర్చు ఎంత అయిందో కూడా బయటపెట్టింది. 5 వేల యూరోలు... అంటే, ఇండియన్ కరెన్సీలో 5 లక్షల రూపాయలు... ‘డాగ్ డైయింగ్’ కోసం ఖర్చుయ్యాయని తెలిపింది. అయితే, హాట్ మోడల్ మాటలు విని కొందరు మురిసిపోయారు. కానీ, చాలా మంది మాత్రం మూగ జీవిని హింసించావంటూ ఫైర్ అయ్యారు. అన్నా స్టూపక్ మాత్రం కుక్కని తామేమీ ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది. దాని చర్మానికి ఎలాంటి హానీ జరగకుండానే వైట్ డాగ్‌ను ఆరెంజ్ డాగ్‌గా మార్చామని వివరించింది! 

Updated Date - 2021-11-19T21:48:06+05:30 IST