కొత్త తరహా ‘గాళ్‌ ఫ్రెండూ..’

ABN , First Publish Date - 2022-11-11T04:13:37+05:30 IST

‘‘లవ్‌ స్టోరీ అనగానే పాటలు, ముద్దులు, రొమాన్స్‌ మాత్రమే అనుకొంటారు. కానీ మా సినిమాలో అంతకు మించిన విషయాలు చాలా ఉన్నాయ’’న్నారు...

కొత్త తరహా ‘గాళ్‌ ఫ్రెండూ..’

‘‘లవ్‌ స్టోరీ అనగానే పాటలు, ముద్దులు, రొమాన్స్‌ మాత్రమే అనుకొంటారు. కానీ మా సినిమాలో అంతకు మించిన విషయాలు చాలా ఉన్నాయ’’న్నారు అట్లూరి నారాయణరావు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘నచ్చింది గాళ్‌ ఫ్రెండూ’. ఉదయ్‌ శంకర్‌ కథానాయకుడు. గురు పవన్‌ దర్శకుడు. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘నిర్మాతగా ఇది నా మూడో సినిమా ఇది వరకు తీసిన ‘నీదీ నాదీ ఒకే కథ’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఉదయ్‌ శంకర్‌ని ముందు నుంచీ గమనిస్తున్నా. ‘ఆటగదరా శివ’లాంటి మంచి సినిమాలు చేశాడు. తనకు రొమాంటిక్‌ జోనర్‌ బాగుంటుందని అనిపించింది. అందుకే ఈ కథ ఎంచుకొన్నాం. దర్శకుడు గురు పవన్‌ తను ఏం చెప్పాడో అదే తీశాడు. మేమంతా ఓ టీమ్‌లా కష్టపడ్డాం. త్వరలోనే నారా రోహిత్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. ఉదయ్‌తో మరో సినిమాని పట్టాలెక్కిస్తామ’’న్నారు. 


Updated Date - 2022-11-11T04:13:37+05:30 IST