Shankar తో సినిమా అంటే తప్పదు భరించాల్సిందే..!

ABN , First Publish Date - 2022-08-27T16:17:12+05:30 IST

శంకర్‌ (Shankar)తో సినిమా అంటే తప్పదు భరించాల్సిందే..! అని కాంప్రమైజ్ అవుతున్నారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు.

Shankar తో సినిమా అంటే తప్పదు భరించాల్సిందే..!

శంకర్‌ (Shankar)తో సినిమా అంటే తప్పదు భరించాల్సిందే..! అని కాంప్రమైజ్ అవుతున్నారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు. తమిళంలో అగ్ర దర్శకుడిగా వెలుగుతున్న శంకర్..ఓ సినిమా మొదలు పెట్టారంటే, అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం ఎవరివల్లా కాదు. దీనికి కారణం ఆయన ఎక్కువగా టెక్నాలిజీని వాడటమే. పదేళ్ళ తర్వాత సమాజంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో, ముందే చెప్పగల సమర్థుడు. మంచి కథా బలమున్న చిత్రాలను హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిస్తున్న శంకర్ వల్ల ఇప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఇబ్బందులు పడుతున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది.


దీనికి కారణం ఇండియన్ 2 (Indian 2) అని చెప్పక తప్పదు. కమల్ హాసన్ (Kamal Haasan), శంకర్ కాంబినేషన్‌లో 1996 వచ్చి సెన్షేషనల్ హిట్ సాధించిన ఇండియన్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ఇండియన్ 2 ఫలితం గురించి మాట్లాడుకునేవారు. కానీ, కరోనాతో పాటుగా దర్శకనిర్మాతల మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో సినిమా కొన్ని నెలలు దాదాపు 70 శాతం చిత్రీకరణ తర్వాత ఆగిపోయింది. 


మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేకపోవడంతో దిల్ రాజు నిర్మాణంలో శంకర్ సినిమా మొదలు పెట్టారు. రామ్ చరణ్, కియారా అద్వానీ (Kiara Advani) జంటగా పాన్ ఇండియా లెవల్‌లో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. అయితే, ఆగస్టు 1వ తేదీ నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ అయ్యాయి. ఇదే సమయంలో ఇండియన్ 2 మేకర్స్ కాంప్రమైజ్ అయి మళ్ళీ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్ళీ ఈ భారీ చిత్రం సెట్స్‌పైకి వచ్చింది. దాంతో ఆర్సీ 15 పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు డైలమాగా ఉంది. మామూలుగానే శంకర్ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో బడ్జెట్ ఎంత పెరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియన్ 2 మళ్ళీ మొదలవడంతో ఆర్సీ 15 ని శంకర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

Updated Date - 2022-08-27T16:17:12+05:30 IST