కొడుకు కోసం ఎదురు చూస్తోన్న నటి... అంతలోనే కాల్పులు జరిపిన దుండగులు... అక్కడికక్కడే...

ABN , First Publish Date - 2021-12-18T16:21:51+05:30 IST

తన పదకొండేళ్ల కొడుకు కోసం ఓ ఫుట్‌బాల్ అకాడమీ వద్ద ఎదురు చూస్తోన్న నటి దుండగుడు జరిపిన కాల్పులకి బలైపోయింది. 42 ఏళ్ల ఆమె పేరు...

కొడుకు కోసం ఎదురు చూస్తోన్న నటి... అంతలోనే కాల్పులు జరిపిన దుండగులు... అక్కడికక్కడే...

తన పదకొండేళ్ల కొడుకు కోసం ఓ ఫుట్‌బాల్ అకాడమీ వద్ద ఎదురు చూస్తోన్న మెక్సికన్ నటి దుండగుడు జరిపిన కాల్పులకి బలైపోయింది. 42 ఏళ్ల ఆమె పేరు తానియా మెండోజా. 1998 నుంచీ ఇప్పటి వరకూ దాదాపు పాతిక చిత్రాల్లో నటించింది. అంతే కాదు, మల్టీ టాలెంటెడ్ తానియా సింగర్ కూడా. ఆమె మెక్సికన్ భాషలో అయిదు మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేసింది.


డిసెంబర్ 14, మంగళవారం నాడు తానియా మెండోజాపై బైక్ వచ్చిన ఇద్దరు కాల్పులకు తెగబడ్డారు. అనేకసార్లు తుపాకీ పేల్చిన వారిద్దరు అందరూ చూస్తుండగానే పరారయ్యారు. మెక్సికన్ నటి అక్కడికక్కడే కొడుకు కళ్ల ముందే చనిపోయింది. కాగా 2010లోనూ తానియా కిడ్నాప్‌కి గురవటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆమెతో పాటూ అప్పట్లో తన భర్త, కొడుకుని కూడా కిడ్నాపర్లు కొన్నాళ్ల పాటూ బంధించారు. తీవ్రంగా గాయపరిచారు కూడా. తానియా ఉంటోన్న ప్రాంతం విడిచి వెళ్లాలని అప్పట్లో కిడ్నాపర్లు హెచ్చరించినట్లు సమాచారం. ఇంత వరకూ అనుమానితుల్ని ఎవర్నీఅరెస్ట్ చేయని పోలీసులు పాత కక్షలే తానియా హత్యకి కారణమై ఉంటాయని భావిస్తున్నారు. అమెరికా లాంటి అగ్ర రాజ్యాన్ని అనుకుని ఉన్నప్పటికీ మెక్సికోలో పేదరికం, నేరాల సంఖ్య రెండూ ఎక్కువే...    

Updated Date - 2021-12-18T16:21:51+05:30 IST