ఎదపై Kartik Aaryan పేరు టాటు వేయించుకుని సర్‌ప్రైజ్ ఇచ్చిన లేడి ఫ్యాన్.. యంగ్ హీరో రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-11-23T17:17:10+05:30 IST

సినిమా నటులకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. వారిపై ఉన్న అభిమానాన్ని వివిధ రకాలు వ్యక్తం చేస్తుంటారు అభిమానులు. కొందరు మాటలతో చెబితే..

ఎదపై Kartik Aaryan పేరు టాటు వేయించుకుని సర్‌ప్రైజ్ ఇచ్చిన లేడి ఫ్యాన్.. యంగ్ హీరో రియాక్షన్ ఏంటంటే..

సినిమా నటులకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. వారిపై ఉన్న అభిమానాన్ని వివిధ రకాలు వ్యక్తం చేస్తుంటారు అభిమానులు. కొందరు మాటలతో చెబితే.. మరికొందరు చేతలతో తెలుపుతుంటారు. తాజాగా బర్త్ డే బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కి సర్‌ఫ్రైజ్ ఇచ్చింది ఓ లేడి ఫ్యాన్.


నవంబర్ 22న బర్త్ డే జరుపుకున్నాడు కార్తీక్ ఆర్యన్. ఈ సందర్భంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఆయన ఇంటిముందు గుమ్మిగూడారు. అందులో ఓ లేడి ఫ్యాన్ కేక్ తీసుకొచ్చింది. దాన్ని ఈ యంగ్ హీరో కట్ చేశాక తన ఎదపై ఆయన పేరుతో పాటు పుట్టిన తేది ఉన్న టాటును చూపించింది. ఎంతో సర్‌ప్రైజ్ అయిన కుర్ర నటుడు ‘నువ్వు టాటు వేయించుకున్నవా?’ అని అడిగాడు. అంతేకాకుండా ఆ అభిమానితో తన ఫోన్‌లోనే వరుసగా సెల్ఫీలు  తీసుకుని, ఆమె అభిమానానికి ధన్యవాదాలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.


ఈ బర్త్ డే బోయ్ తాజా చిత్రం ‘ధమాకా’.. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. హిందీతో పాటు దాదాపు అన్ని సౌతిండియా భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘భుల్ భులయ్యా 2’ అనే హార్రర్ సినిమాలో నటిస్తున్నాడు.



Updated Date - 2021-11-23T17:17:10+05:30 IST