ఉచితంగా బంగారాన్ని ఇస్తానన్న లేడీ ఫ్యాన్.. స్టార్ హీరో రిప్లై ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-04T02:05:02+05:30 IST

కరణ్ జోహార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి అనంతరం హీరోగా

ఉచితంగా బంగారాన్ని ఇస్తానన్న లేడీ ఫ్యాన్.. స్టార్ హీరో రిప్లై ఏంటంటే..

కరణ్ జోహార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి అనంతరం హీరోగా మారిన అందగాడు వరుణ్ ధావన్. షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ కు వరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అనంతరం ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ చిత్రంతో బీ టౌన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా వరుణ్ ధావన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..


వరుణ్ ధావన్ ఓ పని నిమిత్తం బయటకు వచ్చాడు. ఆ సమయంలో రోడ్డు మీద అభిమానులకు కనిపించాడు. అక్కడున్న వారందరికీ హీరో ఉత్సాహంగా ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇస్తున్నాడు. ఇంతలో ఓ లేడీ ఫ్యాన్ వచ్చి తన జ్యువెలరి షాప్‌ను సందర్శించాల్సిందిగా కోరింది. అందుకు బదులుగా ఉచితంగా బంగారాన్ని ఇస్తానని చెప్పింది. ఆమె అలా చెప్పడంతోనే వరుణ్ ధావన్ ఆశ్చర్యపోయాడు. ఉచితంగా బంగారాన్ని ఇవ్వొద్దు అని కోరాడు. ‘‘బంగారాన్ని ఉచితంగా ఏమీ ఇవ్వను. మేకింగ్ ఛార్జీలు మాత్రమే మినహాయిస్తాను’’ అని ఆమె స్పష్టం చేసింది. ఈ ఘటనను అంతా ఓ వ్యక్తి వీడియో తీశారు. సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో కింద పలువురు నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ‘వరుణ్ ధావన్ చాలా మంచి మనిషి’ అంటూ అనేక మంది అతడిని పొగుడుతున్నారు.  



Updated Date - 2022-03-04T02:05:02+05:30 IST