స్ఫూర్తినిచ్చిన యోధుల చరిత్ర

ABN , First Publish Date - 2022-08-18T12:43:46+05:30 IST

జాతీయ గీతం వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ ‘ఆనంద్‌మఠ్‌’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘1770’...

స్ఫూర్తినిచ్చిన యోధుల చరిత్ర

జాతీయ గీతం వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ ‘ఆనంద్‌మఠ్‌’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘1770’.  రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. రాజమౌళి శిష్యుడు అశ్విన్‌ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌కమల్‌ ముఖర్జీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘వందేమాతరం అనేది ఓ మ్యాజికల్‌ పదం. ఈ మంత్రాన్ని బంకించంద్ర ఛటర్జీ అనే మహర్షి మనకు అందించారు. 1770లో స్వాతంత్రం కోసం ప్రజల్లో స్ఫూర్తిని రగిలించిన ఎందరో యోధుల గురించి తెలిపే చిత్రం ఇది’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘అద్భుతమైన ఎమోషన్స్‌,  భారీ యాక్షన్‌ ఘట్టాలతో ఈ చిత్రం రూపొందుతోంది’ అన్నారు. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు. 


Updated Date - 2022-08-18T12:43:46+05:30 IST