ట్రోలర్స్‌ వెనుక ఓ హీరో హస్తం

ABN , First Publish Date - 2022-09-28T11:48:47+05:30 IST

సోషల్‌ మీడియాలో తనను కించపరుస్తూ వీడియోలు పెడుతున్న ట్రోలర్స్‌పై హీరో మంచు విష్ణు ఘాటుగా స్పందించారు...

ట్రోలర్స్‌ వెనుక ఓ హీరో హస్తం

సోషల్‌ మీడియాలో తనను కించపరుస్తూ వీడియోలు పెడుతున్న ట్రోలర్స్‌పై హీరో మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. వారిపై త్వరలోనే సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపైనా, తన కుటుంబంపైనా పనిగట్టుకొని ట్రోలింగ్‌ చేస్తున్న వాళ్లని ఇకపై వదిలిపెట్టేదిలేదని విష్ణు హెచ్చరించారు. తమపై ట్రోలింగ్‌ చేయించేందుకు టాలీవుడ్‌ హీరో ఒకరు 21 మంది ఉద్యోగులను నియమించుకున్నారనీ, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలోనే సైబర్‌క్రైమ్‌ పోలీసులకు సమర్పిస్తానని ఆయన తెలిపారు. 


Updated Date - 2022-09-28T11:48:47+05:30 IST