ఢిల్లీలో మత ఘర్షణలు... Manoj Bajpayee నోటా కవిత... సొషల్ మీడియాలో వైరల్!

ABN , First Publish Date - 2022-04-23T23:48:57+05:30 IST

రెండు నిమిషాల పాటూ సాగే మిలాప్ జవేరీ కవితలో మనోజ్ బాజ్‌పాయ్... గుడి, మసీదు మధ్యలోని కూడలిలో ‘భగవంతుడు, ఖుదా’ సమావేశమయ్యారని చెబుతాడు! అయితే, ప్రార్థించేందుకు నువ్వు రెండు చేతులూ జోడించినా లేదా రెండు చేతుల్ని తెరిచి పెట్టుకున్నా... తేడా ఏం లేదని కూడా అంటాడు! మతల మధ్య సామరస్యాన్ని బోధించే తన కవితకి ‘భగ్‌వాన్ ఔర్ ఖుదా’ అని పేరు పెట్టారు జవేరీ...

ఢిల్లీలో మత ఘర్షణలు... Manoj Bajpayee నోటా కవిత... సొషల్ మీడియాలో వైరల్!

బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ 2020లో ఓ కవితని చదివారు. అయితే, మత సామరస్యం గురించిన ఆ కవిత రెండేళ్ల తరువాత ఇప్పుడు సొషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సదరు కవితని రాసిన బాలీవుడ్ దర్శకుడు మిలాప్ జవేరీ ప్రస్తుత పరిస్థితుల్లో తన 2020 నాటి సందేశం జనానికి చేరటం ఆహ్వానించదగ్గ పరిణామం అంటున్నారు...


రెండు నిమిషాల పాటూ సాగే మిలాప్ జవేరీ కవితలో మనోజ్ బాజ్‌పాయ్... గుడి, మసీదు మధ్యలోని కూడలిలో ‘భగవంతుడు, ఖుదా’ సమావేశమయ్యారని చెబుతాడు! అయితే, ప్రార్థించేందుకు నువ్వు రెండు చేతులూ జోడించినా లేదా రెండు చేతుల్ని తెరిచి పెట్టుకున్నా... తేడా ఏం లేదని కూడా అంటాడు! మతల మధ్య సామరస్యాన్ని బోధించే తన కవితకి ‘భగ్‌వాన్ ఔర్ ఖుదా’ అని పేరు పెట్టారు జవేరీ. 


2020లోనే ‘భగ్‌వాన్ ఔర్ ఖుదా’ కవిత జనంలోకి వచ్చినా అది ఇప్పుడు సొషల్ మీడియాలో మార్మోగుతోంది. అప్పట్లో కరోనా వైరస్ లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో కొనసాగుతుండటంతో నెటిజన్స్ పెద్దగా దృష్టి సారించలేదు. కానీ, తాజాగా మధ్యప్రదేశ్, గుజరాత్, న్యూ దిల్లీ వంటి పలు ప్రాంతాల్లో మత ఘర్షణలు జరగటంతో మరోమారు మిలాప్ జవేరీ, మనోజ్ బాజ్‌పాయ్ కవిత ప్రచారంలోకి వచ్చింది. 


తన కవిత ఎవ్వర్నీ విమర్శించటానికి ఉద్దేశించింది కాదని రచయిత చెబుతున్నారు. హిందువులు, ముస్లిమ్‌లు ఇద్దరూ సామరస్యంగా ఉండాలనే కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా కూడా పదే పదే దురదృష్టకర మత విద్వేషాలు రగులుతుండటం విచారకరమని ఆయన వాపోయారు. ‘సత్యమేవ జయతే, మర్‌జావా, సత్యమేవ జయతే 2’ లాంటి చిత్రాల్ని మిలాప్ జవేరీ గతంలో రూపొందించారు. అలాగే, ‘భగ్‌వాన్ ఔర్ ఖుదా’ కవిత కంటే ముందు ఆయన ‘మేరా భారత్ మహాన్’ అనే కవిత రచించారు. దాన్ని జాన్ అబ్రహాం చదవగా రికార్డ్ చేయటం విశేషం. ముందు ముందు తనకు మరెప్పుడైనా మనసుల్ని స్పృశించే భావం కలిగితే తప్పకుండా కవిత రూపంలో రాస్తానని బాలీవుడ్ దర్శకుడు చెబుతున్నారు... 

Updated Date - 2022-04-23T23:48:57+05:30 IST