దివ్యాంగుడైన స్విమ్మర్ బయోపిక్‌లో రణ్‌వీర్ సింగ్..?

ABN , First Publish Date - 2021-12-31T21:10:13+05:30 IST

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్‌లో స్వతహాగా ఎదిగిన నటుడు రణ్‌వీర్ సింగ్. అతడు హీరోగా నటించిన చిత్రం ‘83’. ఈ సినిమాలో పాత్రకు

దివ్యాంగుడైన స్విమ్మర్ బయోపిక్‌లో రణ్‌వీర్ సింగ్..?

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్‌లో స్వతహాగా ఎదిగిన నటుడు రణ్‌వీర్ సింగ్. అతడు హీరోగా నటించిన చిత్రం ‘83’. ఈ సినిమాలో పాత్రకు గాను అభిమానుల మన్ననలు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. అతడు మరో బయోపిక్‌కు ఒకే చెప్పినట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. దివ్యాంగుడైన స్విమ్మర్ పాత్రలో అతడు నటించబోతున్నట్టు తెలుస్తోంది. 


‘83’ని కబీర్ ఖాన్ తెరకెక్కించారు. ఆ మూవీలో కపిల్ దేవ్ పాత్రను రణ్ వీర్ పోషించారు. భారత క్రికెట్ జట్టు 1983లో వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ‘83’ని  నిర్మించారు. ఆ మూవీ అనంతరం తనకు వరుసగా బయోపిక్‌లల్లో అవకాశాలు వస్తున్నాయని రణ్‌వీర్ సింగ్ వెల్లడించారు. వరుసగా 5 బయోపిక్‌లల్లో అవకాశాలు వచ్చాయని స్పష్టం చేశారు. దివ్యాంగుడైన స్విమ్మర్ పాత్రను పోషించే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. 


తాజాగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ ప్రస్తుతం 5 బయోపిక్‌లల్లో అవకాశాలు వచ్చాయి. అవన్నీ చర్చల దశలో ఉన్నాయి. ఒక కథ మాత్రం అద్భుతమైన స్క్రిఫ్ట్‌గా మారే అవకాశం ఉంది. ఆ చిత్రం గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం ’’ అని రణ్‌వీర్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్  ‘‘ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ’’ సినిమాలో నటిస్తున్నారు. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్నారు. ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. 

Updated Date - 2021-12-31T21:10:13+05:30 IST