777 Charlie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మూవీ.. కానీ కండిషన్స్ అప్లై..

ABN , First Publish Date - 2022-09-25T01:47:18+05:30 IST

‘అతడే శ్రీమన్నారాయణ’ (Athade Srimannarayana) చిత్రంతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty). కొత్త ప్రయోగాలకు ఎల్లప్పుడు సై

777 Charlie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మూవీ.. కానీ కండిషన్స్ అప్లై..

అతడే శ్రీమన్నారాయణ (Athade Srimannarayana) సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty). కొత్త ప్రయోగాలకు ఎల్లప్పుడు సై అంటుంటాడు. తాజాగా అతడు నటించిన చిత్రం ‘777 చార్లి’ (777 Charlie). సంగీత శ్రింగేరి, రాజ్ బి. శెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. కె. కిర‌ణ్ రాజ్‌ (K. Kiran Raj) ద‌ర్శకత్వం వహించాడు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌ం, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో జూన్ 10న విడుదల అయింది. చార్లి అనే కుక్కకు, హీరోకు గల బంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా చూపించారు. ఈ సినిమా జంతు ప్రేమికులను ఎంతగానో కట్టిపడేసింది. ఈ మూవీని థియేటర్స్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు  చూపులకు తెరపడింది. ఈ చిత్రం అతి త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 


‘777 చార్లి’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో సెప్టెంబర్ 30నుంచి అందుబాటులో ఉంటుంది. కానీ, షరతులు వర్తిస్తాయి అని ఓటీటీ ప్లాట్‌ఫాం పేర్కొంది. ‘777 చార్లి’ ని సెప్టెంబర్ 30నుంచి అద్దె చెల్లించి వీక్షించావచ్చని చెప్పింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను చూడవచ్చాని వెల్లడించింది. ఈ మూవీ కన్నడ వెర్షన్ జులై 29 నుంచే వూట్ డిజిటల్ ప్లాట్‌పాంలో స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ వెర్షన్ విడుదల అయిన రెండు నెలలకు చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుంది. ‘777 చార్లి’ తోనే కిరణ్ రాజ్ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తన కలల ప్రాజెక్టు అని తెలిపాడు. మూవీకి సంబంధించిన విశేషాలను చెప్పాడు. ‘‘ఈ చిత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. పెంపుడు జంతువులు ఉన్న వారికి ఈ మూవీ తప్పక నచ్చుతుంది. పెంపుడు జంతువులు లేకపోయినా సరే ఈ సినిమాను చూసినవారు తప్పకుండా వాటిని ఇష్టపడటం ప్రారంభిస్తారు. లాబ్రాడర్ కుక్కలు భావాలను అద్భుతంగా పలికించగలవు. అందుకే ఈ మూవీ కోసం ఆ జాతి కుక్కుని ఎంపిక చేశాం. సినిమా స్క్రిఫ్ట్‌ను యేడాదిన్నర పాటు రాశాను. కుక్కల మీద పరిశోధన చేశాను. హాలీవుడ్‌లో ఇటువంటి చిత్రాలు గతంలో అనేకం వచ్చాయి. అయినప్పటికీ వాటితో ఈ చిత్రానికీ పోలిక లేదు’’ అని కిరణ్ రాజ్ తెలిపాడు.      



Updated Date - 2022-09-25T01:47:18+05:30 IST