Sara Ali Khan పాటకు స్టెప్పులేసిన 63 ఏళ్ల బామ్మ

ABN , First Publish Date - 2021-12-17T23:02:08+05:30 IST

అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం అత్రాంగి రే. క్రిస్ మస్ కానుకగా ఈ సినిమా విడుదల

Sara Ali Khan పాటకు స్టెప్పులేసిన 63 ఏళ్ల బామ్మ

అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం అత్రాంగి రే. క్రిస్‌మస్ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ+హాట్ స్టార్‌లో ఈ సినిమా డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించారు. సినిమాలోని పాటలు మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. చకా చక్ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ పాటకు ఒక బామ్మ డ్యాన్స్ చేసింది. దీంతో ఆ పాట నెట్టింట వైరల్‌గా మారింది.   


రవి బాల శర్మ అనే బామ్మ చకా చక్ పాటకు స్టెప్పులేసింది. సారా అలీఖాన్ మాదిరిగానే ఆమె కూడా డ్యాన్స్ చేసింది. ఆమె స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అభిమానులు ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఆ వీడియోను ఇప్పటి వరకు దాదాపుగా 3లక్షల మంది వీక్షించారు. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి..


విడుదలకు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్‌గా నిలిచింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రూ.80కోట్ల లాభాన్ని అర్జించి పెట్టింది. సినిమాను రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. చిత్ర హక్కులను డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన డిస్నీ+హాట్ స్టార్ రూ.200కోట్లకు దక్కించుకుందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. దీంతో సినిమా విడుదలకు ముందే రూ.80కోట్ల లాభం వచ్చిందని తెలుస్తోంది. బాలీవుడ్‌లో జరిగిన అతిపెద్ద ఓటీటీ డీల్ ఇదేనని అక్కడి మీడియా కోడై కూస్తోంది. 


Updated Date - 2021-12-17T23:02:08+05:30 IST