ఆస్కార్‌ కోసం రూ.50 కోట్లు

ABN , First Publish Date - 2022-11-26T05:30:00+05:30 IST

రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఇప్పుడు ఆస్కార్‌ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మన దేశం తరపున అధికారిక ఎంట్రీగా నిలవలేకపోయినప్పటికీ ప్రైవేటు ఎంట్రీగా 14 విభాగాల్లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ని నామినేషన్‌ బరిలో

ఆస్కార్‌ కోసం రూ.50 కోట్లు

రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఇప్పుడు ఆస్కార్‌ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మన దేశం తరపున అధికారిక ఎంట్రీగా నిలవలేకపోయినప్పటికీ ప్రైవేటు ఎంట్రీగా 14 విభాగాల్లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ని నామినేషన్‌ బరిలో నిలిపారు. ఆస్కార్‌లో నిలవడం ఒక ఎత్తయితే... అక్కడ గెలవడం మరో ఎత్తు. అదంత ఈజీ కాదు. అందుకోసం భారీ ఎత్తున ప్రచారం చేయాలి. అక్కడ పటిష్టమైన పీఆర్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అంతేకాదు. లెక్కలేనన్ని సార్లు స్ర్కీనింగ్‌ చేయాలి. అందుకోసం చాలా ఖర్చు అవుతుంది. అందుకే కేవలం ఆస్కార్‌ ప్రచారం కోసం రూ.50 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 14 విభాగాల్లో పోటీ పడి, కనీసం ఒక్క ఆస్కార్‌ అయినా గెలుచుకోవాలన్నది రాజమౌళి బృంద ఆలోచన. ఒక్క ఆస్కార్‌ కోసం రూ.50 కోట్లు ఖర్చు పెట్టడం మామూలు విషయం కాదు. కానీ దీని వెనుక రాజమౌళి మాస్టర్‌ ప్లాన్‌ ఉంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ గనుక ఆస్కార్‌ గెలుచుకొంటే, ఆ ఖ్యాతి దక్కించుకొన్న తొలి భారతీయుడుగా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ నిలుస్తుంది. అంతే కాదు.. రాజమౌళి నుంచి రాబోయే సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారాన్ని పొందుతాయి. ‘ఆస్కార్‌ విజేత..’ అంటూ ఓ ట్యాగ్‌లైన్‌ దొరుకుతుంది. తదుపరి సినిమాలు భారీ ఎత్తున అమ్ముడుపోవడానికీ, ప్రపంచ వేదికలపై ప్రదర్శించడానికీ మార్గం సుగమం అవుతుంది. అయితే ఇదంతా అంత తేలికైన విషయం కాదు. ‘పోతే 50 కోట్లు, వస్తే ఆస్కార్‌’ అంటూ తెగిస్తేనే గెలుపు సాధ్యం అవుతుంది. అందుకే రాజమౌళి ఇంత రిస్క్‌ తీసుకొంటున్నట్టు సమాచారం.

Updated Date - 2022-11-26T05:30:00+05:30 IST