Aryan Khan Drugs Case.. ఈ 5 కారణాల వల్లే ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్..!

ABN , First Publish Date - 2022-05-28T21:27:20+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (Aryan Khan)కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మే 27న క్లీన్ చిట్ ఇచ్చింది. డ్రగ్స్-ఆన్-క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్, మరో

Aryan Khan Drugs Case.. ఈ 5 కారణాల వల్లే ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్..!

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (Aryan Khan)కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మే 27న క్లీన్ చిట్ ఇచ్చింది. డ్రగ్స్-ఆన్-క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్, మరో ఐదుగురిపై నమోదైన ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. గత సంవత్సరం అక్టోబరు 2న ముంబైలో ఓ క్రూయిజ్ షిప్‌పై నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ దొరికినట్లు ఆరోపిస్తూ, 14 మందిపై దాదాపు 6,000 పేజీల  ఛార్జిషీటును ఎన్‌సీబీ శుక్రవారం దాఖలు చేసింది. 


ఆర్యన్ ఖాన్‌కు 5 కారణాల వల్లే క్లీన్‌చిట్..!


1. డ్రగ్స్ దాడులు జరిపినప్పుడు తప్పనిసరిగా వీడియో తీయాలి. కానీ, ఈ కేసులో వీడియో తీసిన దాఖలాలు లేవు. 


2. డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపించేందుకు ఎటువంటి మెడికల్ టెస్ట్‌లు నిర్వహించలేదు. 


3. ఏ డ్రగ్స్‌ను రికవరీ చేయలేదు. ఆర్యన్ మాదక ద్రవ్యాలను సేవించినట్టు ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదు. 


4. ఆర్యన్ ఖాన్ మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. అతడి ఫోన్‌ను అధికారికంగా స్వాధీనం చేసుకోకుండా వాట్సప్ చాట్‌లను చెక్ చేశారు. ఆ చాట్స్‌తో ఆర్యన్  డ్రగ్స్ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. 


5. మొదటగా ఓ సాక్షి ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ ఉన్నట్టు పేర్కొన్నాడు. అనంతరం ఆ సాక్షి సిట్ దర్యాప్తు చేస్తున్నప్పుడు మాట మార్చాడు. అధికారులు తెల్ల కాగితం మీద సంతకాలు తీసుకున్నారని ఆరోపించాడు. అనంతరం అధికారులు దాడులు జరినప్పుడు క్రూయిజ్ షిప్‌లో లేమని మరో ఇద్దరు సాక్షులు చెప్పారు. 


ముంబైలో క్రూయిజ్ షిప్‌పై గత ఏడాది అక్టోబరు 2న ఎన్‌సీబీ దాడులు నిర్వహించింది. ఈ కేసులో 14 మందిని నిందితులుగా ఛార్జిషీటులో పేర్కొంది. ఈ ఛార్జిషీటులోని నిందితుల జాబితాలో ఆర్యన్ ఖాన్‌ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఆర్యన్, మోహక్ మినహా మిగిలిన నిందితులందరి వద్ద మాదక ద్రవ్యాలు లభించాయని ఎన్‌సీబీ అధికారి సంజయ్ కుమార్ సింగ్ తెలిపాడు. ఇదిలావుండగా, ఈ నౌకపై దాడులు చేసిన ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే తాజా పరిణామాలపై స్పందించేందుకు నిరాకరించాడు. ఈ కేసుతో ప్రస్తుతం తనకు సంబంధం లేదని చెప్పాడు.

Updated Date - 2022-05-28T21:27:20+05:30 IST