Savitri: 47 సంవత్సరాల తర్వాత న్యాయం జరిగిందనే వార్తల్లో నిజం లేదు

ABN , First Publish Date - 2022-09-17T17:17:03+05:30 IST

సీనియర్‌ నటి, దివంగత మహానటి సావిత్రి (Savitri)కి సంబంధించిన ఓ వార్త.. తాజాగా సోషల్ మాధ్యమాలలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె నివాస భూమికి సంబంధించి కోర్టులో..

Savitri: 47 సంవత్సరాల తర్వాత న్యాయం జరిగిందనే వార్తల్లో నిజం లేదు

సీనియర్‌ నటి, దివంగత మహానటి సావిత్రి (Savitri)కి సంబంధించిన ఓ వార్త.. తాజాగా సోషల్ మాధ్యమాలలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె నివాస భూమికి సంబంధించి కోర్టులో నడుస్తున్న కేసులో.. దాదాపు 47 సంవత్సరాల తర్వాత న్యాయం జరిగిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు ఫేక్ అని తెలిసింది. ఈ విషయంలో సావిత్రి కుమార్తె (Savitri Daughter)ను సంప్రదించగా.. ఆమె కూడా వినిపిస్తున్న వార్తలు నిజం కావని నిర్థారించారు. అసలు వినిపించిన వార్తలలోని సారాంశం ఏమిటంటే..



‘‘హైదరాబాద్‌లో రూ.450 (450 crores land)కోట్ల విలువైన నివాస స్థలం సావిత్రి గణేష్‌(Savitri ganesh), రామస్వామి గణేశ్‌ల చట్టబద్థమైన ఆస్తిగా నిర్థారించబడింది. ఆ భూమిని సావిత్రి 1967లో తన సోదరి, ఆమె భర్తకు ఇచ్చింది. కొన్నాళ్లకు అంటే 1971లో తన అవసరాల నిమిత్తం వెనక్కి ఇవ్వాలని సావిత్రి కోరగా.. తన సోదరి తిరస్కరించింది. దాంతో సావిత్రి 1974లో కేసు ఫైల్‌ చేశారు. 1980లో ఆమె ఆ కేసులో ఓడిపోయారు. ఏడాది తర్వాత 1981లో సావిత్రి వారసులు కేసు రీఫైల్‌ చేశారు. 1999లో హెచ్‌సి(HC) ఆ కేసును కొట్టివేసింది. 2002లో మరోసారి కేసు ఫైల్‌ అయింది. సావిత్రి కజిన్‌ సిస్టర్‌ ఆ భూమిని కొనుగోలు చేసినట్లు ఆధారాలు, దానికి సంబంధించిన మూలాలను 15 సంవత్సరాలుగా సమర్పించలేదన్న కారణంతో హైదరాబాద్‌ హైకోర్టు రాజీ చేయాలని నిర్ణయించింది. ఆ ఆస్తికి సంబంధించిన మొత్తాన్ని సావిత్రి, జెమిని వారసులకు అప్పగించాలని కోర్టు నిర్ణయించింది. అందుకు ప్రస్తుతం ఆ ఆస్తిని అనుభవిస్తున్న వారు కూడా అంగీకరించారు. సావిత్రి వారసులు ఒక్కొక్కరికి రూ.163 కోట్లు, ప్రస్తుత యజమాని.. సావిత్రి కజిన్‌ సిస్టర్‌కు రూ. 124 కోట్లు ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. 16 ఏళ్లు కేసు నడిచిన తర్వాత 1995లో ఐటీ డిపార్ట్‌మెంట్‌ రూ.27.07 లక్షలు సావిత్రి కుటుంబానికి వాపసు ఇచ్చింది. 27 ఏళ్ల కేసు నడిచిన తర్వాత అంటే 2011లో ఐటీ శాఖ సావిత్రి కుటుంబానికి 4.80 కోట్లు వాపసు చేసింది..’’ అనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపధ్యంలో అసలు కోర్టు ఈ ఆస్తి గొడవలపై ఎటువంటి తీర్పు ఇవ్వలేదని, వినిపిస్తున్న వార్తలు ఫేక్ అని చెబుతూ.. ఆ వార్తలను సావిత్రి కుమార్తె ఖండించారు.



Updated Date - 2022-09-17T17:17:03+05:30 IST