The Warrior: 'బుల్లెట్' సాంగ్‌కు అంత ఖర్చు చేశారా..?

ABN , First Publish Date - 2022-04-24T13:49:37+05:30 IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటిస్తున్న 'ది వారియర్' సినిమా నుంచి తాజాగా 'బుల్లెట్' అనే సాంగ్ వచ్చి యూట్యూబ్‌లో అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతోంది.

The Warrior: 'బుల్లెట్' సాంగ్‌కు అంత ఖర్చు చేశారా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటిస్తున్న 'ది వారియర్' సినిమా నుంచి తాజాగా 'బుల్లెట్' అనే సాంగ్ వచ్చి యూట్యూబ్‌లో అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతోంది. తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామీ దర్శకత్వంలో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఆదిపినిశెట్టి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే, తాజాగా వచ్చిన 'బుల్లెట్' పాట కోసం దర్శక, నిర్మాతలు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క పాటకే ఇంత ఖర్చు చేశారంటే..ఇక సినిమాకు ఎంత బడ్జెట్ కేటాయించారో అని ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి. కాగా, ఈ పాటను తమిళ హీరో శింబు పాడాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి. 



Updated Date - 2022-04-24T13:49:37+05:30 IST