హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న 30 Years Industry పృథ్వీ కుమార్తె!

ABN , First Publish Date - 2022-06-02T02:49:07+05:30 IST

కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాలలో నటించి, ప్రేక్షకులను మెప్పించిన నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ (30 Years Industry Prudhvi). నటుడిగా బిజీగా ఉన్న సమయంలో రాజకీయ బాట పట్టిన పృథ్వీ.. అక్కడ తగిలిన

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న 30 Years Industry పృథ్వీ కుమార్తె!

కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాలలో నటించి, ప్రేక్షకులను మెప్పించిన నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ (30 Years Industry Prudhvi). నటుడిగా బిజీగా ఉన్న సమయంలో రాజకీయ బాట పట్టిన పృథ్వీ.. అక్కడ తగిలిన ఝలక్‌తో మళ్లీ సినిమాలలో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడాయనే కాదు.. ఆయన కుమార్తె కూడా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా అమ్మాయి శ్రీలు (Sreelu) హోటల్ మేనేజ్మెంట్ చేసి.. మలేసియా వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంది కానీ.. డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి.. నిదానంగా నటన కూడా నేర్చుకుంది. నటనపై మక్కువతో కొన్ని సన్నివేశాలను చూసి అనుకరించేది. అమ్మాయిని ఘనంగా ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని అనుకున్నాము కానీ కుదరలేదు. చివరికి నా స్నేహితుడి కుమారుడు క్రాంతి (Kranthi) హీరోగా ముగ్గురు భాగస్వాములు కలిసి నిర్మిస్తున్న ‘కొత్త రంగుల ప్రపంచం’ (Kotha Rangula Prapancham) చిత్రంతో మా అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఒక టీమ్ వర్క్ గా కథ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ రైటర్ ఘటికాచలంగారు ఈ సినిమాకు ఎంతో సహాయం చేశారు. అమ్మాయి,  అబ్బాయిల ప్రతిభ చూశాక నిర్మాతలు కూడా ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను తీశారు. పాటలన్ని అద్భుతంగా వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. శ్రీ పిఆర్ క్రియేషన్స్ (Sri PR Creations) బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను తన ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న దర్శకుడికి నా కృతజ్ఞతలు. అతను రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమాను తీస్తున్నారు. త్వరలో ఆయన పేరు, వివరాలు మీకు తెలుపుతాను. నన్ను ఆశీర్వదించినట్లే.. మా అమ్మాయిని కూడా ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా ప్రేక్షకులందరినీ కోరుతున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2022-06-02T02:49:07+05:30 IST