1948 Akhand Bharat: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే.. ఈ సినిమా సెన్సార్ అయ్యేది కాదట!

ABN , First Publish Date - 2022-08-06T00:19:02+05:30 IST

ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ (MYM Creations) పతాకంపై.. ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో సీనియర్ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం ‘1948-అఖండ భారత్’ (1948 Akhand Bharat). అన్ని భారతీయ

1948 Akhand Bharat: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే.. ఈ సినిమా సెన్సార్ అయ్యేది కాదట!

ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ (MYM Creations) పతాకంపై.. ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో సీనియర్ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం ‘1948-అఖండ భారత్’ (1948 Akhand Bharat). అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం ఈనెల 12న విడుదల కాబోతోంది. సుమారు 96 ముఖ్య పాత్రలతో అత్యంత భారీగా తెరకెక్కిన ఈ చిత్ర విడుదల సందర్భంగా మేకర్స్.. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్రయూనిట్‌తో పాటు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ (Prasanna Kumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘అఖండ’ (Akhanda) తరహాలో.. ‘1948 - అఖండ భారత్’ చిత్రం విజయం సాధించేలా కనిపిస్తుంది. నాకు తెలిసి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే... తలకిందులుగా తపస్సు చేసినా... ఈ చిత్రం సెన్సార్ అయ్యేది కాదు. తెలుగువారంతా గర్వపడేలా ఈ చిత్రాన్ని రూపొందించిన యూనిట్‌కు నా అభినందనలు’’ అని టీమ్‌ని ప్రసన్న కుమార్ అభినందించారు.


చిత్ర దర్శకుడు ఈశ్వర్ బాబు.డి మాట్లాడుతూ...11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి... 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్‌లో, 9 షెడ్యూల్స్‌లో.. ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా తెలపగా.. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉందని.. దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ రాజు (Nathuram Godse పాత్రధారి) ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్‌లో ఉన్న సెన్సార్ బోర్డ్... ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే... ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు. 


Nathuram Godse పాత్రధారి డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ.. ‘‘గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికీ తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానిక్కారణం... గాడ్సే తన కోర్టు వాదనలో గాంధీజీని వధించడానికి గల కారణాలను సుమారు 150 పాయింట్స్ గా.. 8 గంటలపాటు సుదీర్ఘంగా వివరించినా.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కోర్ట్ నుంచి బైటికి రానివ్వకుండా నిషేధించింది. గాడ్సేని ఉరి తీసిన సుమారు 30 సంవత్సరాల తర్వాత... ఆయన కోర్ట్‌లో ఇచ్చిన వాగ్మూలం బయటకు వచ్చినా- దాన్ని కూడా  ప్రచురణ కాకుండా అడ్డుకున్నారు. అలా 70 సంవత్సరాల పాటు దాచి పెట్టబడిన నిజాలను... ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. గాంధీజీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి... హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా.. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-08-06T00:19:02+05:30 IST