‘ఆలి’యాకి ముందు... రణబీర్ జీవితంలో 11 మంది ‘ఆమె‘లు!

ABN , First Publish Date - 2022-04-15T23:50:43+05:30 IST

మిస్ భట్... మిసెస్ కపూర్ అయిపోయింది. కపూర్ ఖాన్‌దాన్ బహూగా రణబీర్ జీవితంలో ఆలియా కుడికాలు మోపింది. అయితే, బాలీవుడ్ ‘రాక్‌స్టార్’ రీల్ అండ్ రియల్ లైఫ్ రెండిట్లోనూ ఎంత రొమాంటికో మనకు తెలియంది కాదు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన బీ-టౌన్ ప్లేబాయ్ చాలా మందితోనే సరసాలు సాగించాడు. అందులో కొందరు మనకు తెలుసు. కొందరు అంతగా తెలియదు. మరికొందరి గురించి మీడియా నానా యాగీ చేసింది కానీ... నిజంగా ఘాటైన ఎఫైరేం ఉండకపోవచ్చు! ఏది ఏమైనా, రిషీ కపూర్, నీతూ కపూర్ వారసుడి గాళ్‌ఫ్రెండ్స్ చిట్టా పెద్దదే! మొత్తం 11 మంది పేర్లు ఆర్కే(రణబీర్ కపూర్)తో కలిపి వినిపించాయి...

రణబీర్ కపూర్ అసలు బాలీవుడ్ హీరో కూడా అవ్వక ముందే అవంతికా మలిక్ మీద మనసు పారేసుకున్నాడు. అయితే, ఆమెతో ప్రేమ పెద్దగా ముందుకు సాగలేదు. రణబీర్‌తో బ్రేకప్ తరువాత ఆమీర్ ఖాన్ మేనల్లుడు, యాక్టర్ ఇమ్రాన్ ఖాన్‌ని పెళ్లాడింది అవంతిక. ఇక ఆర్కే వారి అందాల రాశుల లిస్టులో రెండో పేరు... నందితా మహ్తానీ. ఈమె ఫ్యాషన్ డిజైనర్. బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ మొదటి భార్య. కానీ, నందితతో రణబీర్ ప్రేమ వ్యవహారం కూడా అంతగా ఘాటెక్కలేదు. కారణం వారిద్దరి మధ్యా ఉన్న పదేళ్ల వయస్సు తేడా కూడా అయ్యి ఉండొచ్చంటారు బాలీవుడ్ జనం. రణబీర్ కంటే నందితా దాదాపు పదేళ్లు పెద్ద!

రణబీర్ రసికతకు పడిపోయిన హీరోయిన్స్ విషయానికి వస్తే... మొదటగా చెప్పుకోవాలి సోనమ్ కపూర్ పేరు. ఆమె రణబీర్ ఫస్ట్ మూవీ ‘సావరియా‘లో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసింది. అది ఆఫ్‌స్క్రీన్‌లోనూ కొనసాగిందంటారు. ప్రియాంక చోప్రాతోనూ కపూర్ ప్లేబాయ్ ప్రియమైన ప్రణయం సాగించాడు. కానీ, సొనమ్, ప్రియాంక లవ్ స్టోరీస్‌ ఎక్కువ కాలం రణబీర్ మనస్సుని పట్టి పెట్టలేకపోయాయి. కొద్ది రోజుల్లోనే చల్లారిపోయాయి. 

ఆలియా భట్‌తో పెళ్లికి ముందు రణబీర్ జీవితంలోకి ఇలా వచ్చి అలా వెళ్లిన 11 మంది పడుచుల్లో... మనం ఊహించని వారి పేర్లు చాలానే ఉన్నాయి. ‘రాక్‌స్టార్’ బ్యూటీ నర్గీస్ ఫక్రీతో రాకింగ్ రొమాన్స్ సాగిందంటారు. ‘కింగ్‌ఫిషర్’ క్యాలెండర్ గాళ్ ఏంజిలా జాన్సన్‌తో కూడా రణబీర్ కొన్నాళ్లు వ్యవహారం నడిపాడట. పాకిస్థాన్ నుంచీ ఇండియాకు వచ్చి కొన్నాళ్లు హల్‌చల్ చేసిన మాహీరా ఖాన్ కూడా మనవాడి మనసు దోచిందట. కానీ, ఆర్కేతో వ్యవహారం పాకానికి రాక ముందే తను పాక్‌కి వెళ్లిపోయింది! వీళ్లే కాదు... తెలుగు ఆడియన్స్‌కి కూడా బాగా తెలిసిన అమీషా పటేల్, శ్రుతీ హసన్ లాంటి వారు కూడా రణబీర్ లింకప్స్ లిస్టులో ఉన్నారు. కానీ, వీరితో ఎఫైర్ వార్తల్ని ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు... 

లాస్ట్ బట్ బెస్ట్ ఆఫ్ ఆల్... రణబీర్ అనగానే మనకు గుర్తొచ్చే ఇద్దరు గార్జియస్ బీ-టౌన్ గాడెసెస్... దీపికా, కత్రీనా! వీళ్లతో రణబీర్ కపూర్ ప్రేమకథలు ఎంత గాఢంగా సాగాయంటే... వారిద్దరిలో ఏ ఒక్కరు ఏడు అడుగులు వేసి ఉన్నా... ఆలియా స్టోరీ ఒక్క అడుగు కూడా ముందుకు పడేది కాదు. దీపికా, రణబీర్ జంట ఇప్పటికీ అభిమానులకి మోస్ట్ ఫేవరెట్. క్యాట్‌తో కపూర్ అందగాడి హంగామా ఏ రేంజ్‌లో ఉండేదో బాలీవుడ్‌తో పరిచయం ఉన్న అందరికీ తెలిసిందే. కానీ, విక్కీ కౌశల్‌ని కత్రీనా... రణవీర్‌ని దీపికా పెళ్లాడేశారు! తాజాగా తనవంతు రావటంతో... పదేళ్లు జూనియర్ అయిన ఆలియాని తన ఆలిగా... జీవితంలోకి ఆహ్వానించాడు... 39 ఏళ్ల ముంబై మన్మథుడు!  

Updated Date - 2022-04-15T23:50:43+05:30 IST