ఇక సినిమాలకు స్వస్తి

ABN , First Publish Date - 2022-05-16T06:54:47+05:30 IST

Udhayanidhi Stalin

ఇక సినిమాలకు స్వస్తి

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు, డీఎంకే శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్‌ ఇకపై సినిమాలలో నటించనని ప్రకటించారు. ఉదయనిధి హీరోగా నటించిన ‘నెంజుక్కునీది’ ఈ నెల 20న విడుదలవుతోంది. ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ‘మామన్నన్‌’ అనే చిత్రంలో నటించనున్నానని, అదే తన చివరి చిత్రమవుతుందని తెలిపారు. ఇకపై పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితమవుతానని ఆయన స్పష్టం చేశారు. ఉదయనిధి స్టాలిన్‌కు త్వరలో మంత్రి పదవి లభించనుందని డీఎంకే సీనియర్‌ నేతలు, రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన సినిమాలకు దూరమవుతున్నారని కోలీవుడ్‌ అంతటా తీవ్ర ప్రచారం సాగుతోంది.

- ఆంధ్రజ్యోతి, చెన్నై  

Updated Date - 2022-05-16T06:54:47+05:30 IST