యామినీ ఈఆర్: ఆసక్తికరంగా 'క్వీన్' గ్లింప్స్
ABN, Publish Date - Feb 14 , 2026 | 04:17 PM
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'క్వీన్'. వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ ప్రతినాయకులుగా నటిస్తున్నారు. ఏ సినిమాకు ఎంతో కీలకం ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం 90's హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు. శనివారం వాలెంటైన్స్ డే సందర్భంగా 'క్వీన్' టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తే ప్రస్తుత సొసైటీ తో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.
Updated at - Feb 14 , 2026 | 04:19 PM