Mogudu: ఆసక్తికరంగా విశాల్ 'మొగుడు' గ్లింప్స్
ABN , Publish Date - Jan 22 , 2026 | 02:13 PM
విశాల్, తమన్నా జంటగా సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మొగుడు'. కుష్బూ సుందర్ సమర్పణలో A.C.S అరుణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యోగిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాఫ్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను గురువారం విడుదల చేశారు. ఈ వీడియోలో కేవలం ఈ మూడు పాత్రలే చూపించి అంచనాలు క్రియేట్ చేశారు డైరెక్టర్. 'ఇలా చూడండి.. మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్యా' అంటూ యోగిబాబు చెప్పిన సీరియల్ క్లిపింగ్ చూపిస్తూ మొగుడు గ్లింప్స్ మొదలుపెట్టారు. ఈ గ్లింప్స్ చూస్తే కామెడీ మరోవైపు యాక్షన్ సమపాళ్లలో ఉంటుందని తెలుస్తుంది.