ఉపాసన ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట వైరల్
ABN, Publish Date - Feb 09 , 2026 | 11:37 PM
రామ్‌చరణ్ భార్య ఉపాసన (Upasana) సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. జనవరి 31న ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాను రెండోసారి గర్భవతి అయినప్పటి నుంచి సీమంతం, అలాగే ప్రసవానికి ముందు ఉండే టెన్షన్.. పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి సందడి నెలకొంది అన్న విషయాలను తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. 'ఇది చూసినప్పుడల్లా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. అపోలో ఆస్పత్రి వైద్యులు, రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. మా కుటుంబంపై ప్రేమ చూపించిన అందరికి థాంక్స్' అని ఉపాసన పేర్కొన్నారు.
Updated at - Feb 10 , 2026 | 09:25 AM