దిల్ రాజు స్టార్ట్ చేశాడుగా! మార్కండేయ గ్లింప్స్ అదిరింది
ABN , Publish Date - Feb 12 , 2026 | 07:58 PM
దిల్ రాజు (Dil Raju) కొంత గ్యాప్ తర్వాత ఇంట్రెస్టింగ్ మూవీతో సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
దిల్ రాజు (Dil Raju) కొంత గ్యాప్ తర్వాత.. ఇంట్రెస్టింగ్ మూవీతో సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. విక్రాంత్ (Vikranth) హీరోగా దిల్ రాజు డ్రీమ్స్ (Dil Raju Dreams) బ్యానర్‌పై నూతనంగా ఓ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు శిష్ట్లా వి.ఎం.కె. (Sistla VMK) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా గురువారం అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ ఓ గ్లిమ్స్ విడుదల చేసి సినిమా పేరు మార్కండేయ (Markandeya) అని రివీల్ చేశారు. మిస్టిక్ అడ్వెంచర్, డివైన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్లు, వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు దిల్ రాజు తెలిపారు.