The Vvaan Movie: తమన్నా చిత్రం నుంచి మూడో పాట!

ABN, Publish Date - Sep 21 , 2026 | 04:09 PM

తమన్నా తాజా చిత్రం 'The Vvaan' నుంచి మూడో పాట విడుదలైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాటకు తనీష్క్‌ బాగ్చీ స్వరాలు సమకూర్చారు.

సిద్ధార్థ్‌ మల్హోత్రా, తమన్నా జంటగా నటిస్తున్న 'ద వన్‌' మూవీ ఈ నెల 25న విడుదల కాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ డివోషనల్‌ ఫాంటసీ మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా 'ధణక్ ధణక్' అంటూ సాగే మూడో పాటను మేకర్స్ రిలీజ్‌ చేశారు. తనిష్క్ బాగ్చీ ఈ పాటకు స్వరాలను సమకూర్చి, షబ్బీర్ అహ్మద్‌ తో కలిసి దీనిని రాశారు. దేవ్‌ నేగి, ఆకాశ్‌ సింగ్‌ దీనిని పాడారు. సిద్దార్థ్‌ మల్హోత్రా, తమన్నా, వందలాది మంది డానర్స్ పై ఐటమ్‌ సాంగ్‌ను తలపించేలా ఉన్న ఈ గీతానికి బాస్కో వెస్లీ మార్టిస్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఈ మధ్య కాలంలో తమన్నా హీరోయిన్ గా నటించిన చిత్రాలేవీ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించలేదు. ఆ లోటు ఈ సినిమాతో తీరుతుందనే ధీమాను తమన్నా వ్యక్తం చేస్తోంది.

Updated at - Sep 21 , 2026 | 04:10 PM