Nagabandham: సుర సుర సుక్కలు తేరా సుట్టేదాం..
ABN, Publish Date - Apr 19 , 2026 | 02:36 PM
‘నాగబంధం’ (Nagabandham) చిత్రంలోని మరో పాటను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. సుర సుర సుక్కలు తేరా సుట్టేదాం.. తర తర తోరణాలే కట్టేదాం’ అంటూ పెళ్లి నేపథ్యంలో సాగే పాట ఇది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. నల్గొండ గద్దర్, అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ పాడారు. జునైద్ కుమార్, అభే సంగీతం అందించారు. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రమిది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేశ్, ఐశ్వర్యా మేనన్ కథానాయికలు. జులై 3న సినిమా విడుదల కానుంది.
Updated at - Apr 19 , 2026 | 02:38 PM