Anumana Pakshi: అనుమానాలతో నవ్వించేలా.. ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌ వచ్చేసింది!

ABN, Publish Date - Sep 14 , 2026 | 04:41 PM

కామెడీకి కాస్త అనుమానాన్ని జోడించి తెరకెక్కిన ‘అనుమాన పక్షి’ చిత్రం ట్రైలర్ వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు.

కామెడీకి కాస్త అనుమానాన్ని జోడించి తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’ (Anumana Pakshi). రాగ్‌మయూర్‌(Rag Mayur), మెరిన్‌ ఫిలిప్‌ జంటగా నటించిన ఈ సినిమాకు ‘డీజే టిల్లు’ ఫేమ్‌ విమల్‌కృష్ణ దర్శకత్వం వహించారు. చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక, రాజేశ్‌ జగ్తియాని, హీరాచంద్‌ దండ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబరు 18న  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయకచవితి సందర్భంగా చిత్రబృందం మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఆద్యంతం కామెడీతో పాటు ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగింది.

ప్రతి చిన్న విషయాన్ని అనుమానించే ఓ వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతడి అనుమానాల కారణంగా అతని జీవితంలోనే కాకుండా.. అతని చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే అంశాన్ని వినోదాత్మకంగా చూపించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.  

Updated at - Sep 14 , 2026 | 05:03 PM