Nagabandham: ఆకట్టుకుంతోన్న నాగబంధం ట్రైలర్

ABN, Publish Date - Jun 19 , 2026 | 05:31 PM

విరాట్‌ కర్ణ కథానాయకుడిగా రూపొందుతున్న ‘నాగబంధం’ చిత్రం ట్రైలర్‌ ను శుక్రవారం విడుదల చేశారు.

విరాట్‌ కర్ణ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). నభా నటేశ్, ఐశ్వర్య మేనన్‌  నాయికలు. జగపతిబాబు కీలక పాత్ర  పోషిస్తున్నారు. అభిషేక్‌ నామా దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుంది. టీజర్‌తో హైప్ క్రియేట్  అయింది. శుక్రవారం ట్రైలర్‌ ను విడుదల చేశారు. పురాతనమైన రహస్యాలు, నాగబంధం సంప్రదాయంతో ముడిపడిన కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లు మేకర్స్ చెబుతున్నారు.  కిషోర్‌ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated at - Jun 19 , 2026 | 05:41 PM