నవ్వులు పూయిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్
ABN, Publish Date - Aug 01 , 2026 | 01:59 PM
వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు.
వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’ (korean kanakaraju). రితిక నాయక్ కథానాయికగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. వరుణ్ తేజ్, సత్యల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటుండగా, భయపెట్టే ఎలిమెంట్స్‌తో పాటు ఆసక్తికరమైన ట్విస్టులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు.
Updated at - Aug 01 , 2026 | 03:04 PM