‘ఇట్లు అర్జున’ నుంచి యూత్‌ఫుల్ సాంగ్.. వచ్చేసింది

ABN, Publish Date - Nov 24 , 2026 | 04:33 PM

‘ఇట్లు అర్జున’ సినిమా నుంచి ‘హాయ్ రే’ అంటూ సాగే యూత్‌ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘షిరిడి సాయి’, ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాల నిర్మాత ఏ. మహేశ్వర రెడ్డి కుమారుడు అనీష్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itllu Arjuna). మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించారు. అక్కినేని నాగార్జున సమర్పణలో వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘హాయ్ రే’ అంటూ సాగే ఈ యూత్‌ఫుల్ వీడియో సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి.

Updated at - Nov 24 , 2026 | 04:45 PM